Telangana Elections: ఇందిరమ్మ రాజ్యంతో ఒరిగింది ఏంటి..? మంత్రి కేటీఆర్ – భట్టి మధ్య మాటల తూటాలు

|

Nov 23, 2023 | 3:06 PM

ఇందిరమ్మ రాజ్యం అంటే.. ఆకలి రాజ్యం, గంజికేంద్రాలు, నక్సలిజం, నిరుద్యోగం అని టీవీ9 కాన్‌క్లేవ్‌లో విమర్శించారు మంత్రి కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యం అంత గొప్పగా ఉంటే పార్టీ పెట్టిన 9 మాసాలకే ఎన్టీఆర్ ఎలా సీఎం అయ్యారని ప్రశ్నిస్తూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ సమర్థించారు. టీవీ9 మెగా కాన్‌క్లేవ్ వేదికగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.

ఇందిరమ్మ రాజ్యం అంటే.. ఆకలి రాజ్యం, గంజికేంద్రాలు, నక్సలిజం, నిరుద్యోగం అని టీవీ9 కాన్‌క్లేవ్‌లో విమర్శించారు మంత్రి కేటీఆర్. ఇందిరమ్మ రాజ్యం అంత గొప్పగా ఉంటే పార్టీ పెట్టిన 9 మాసాలకే ఎన్టీఆర్ ఎలా సీఎం అయ్యారని ప్రశ్నిస్తూ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కేటీఆర్ సమర్థించారు. ఇందిరమ్మ రాజ్యం అట్టర్ ప్లాప్ అయినందునే తెలంగాణ ప్రజలు ఎన్టీఆర్‌కు పట్టంకట్టారని అన్నారు. కేసీఆర్ పిలుపు మేరకు మార్పు కోసం తెలంగాణ ప్రజలు 2014లో తీర్పు ఇచ్చారని అన్నారు. 11 సార్లు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు మార్పు కోసం ఓటు వేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు.

ఇందిరమ్మ రాజ్యంలో పేద ప్రజలకు మంచి జరిగిందంటూ.. కేటీఆర్‌కు కౌంటర్ ఇచ్చారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క.  టీవీ9 మెగా కాన్‌క్లేవ్‌లో ఇద్దరు నేతలు ఏం మాట్లాడారో.. బిగ్‌ఫైట్ బైట్‌లో చూద్దాం.

Published on: Nov 23, 2023 03:04 PM