Vijaya Shanthi: సీఎం కేసీఆర్, కేటీఆర్ పై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు ..
బీజేపీ కార్యవర్గ సమావేశంలో తెలంగాణపై ప్రత్యేకంగా చర్చిస్తామని అంటున్నారు ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి. ఈ సమావేశాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మార్పు వస్తుందని చెబుతున్నారు.
బీజేపీ కార్యవర్గ సమావేశంలో తెలంగాణపై ప్రత్యేకంగా చర్చిస్తామని అంటున్నారు ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి. ఈ సమావేశాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మార్పు వస్తుందని చెబుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం అవినీతి పాలన నడుపుతోందని ఆరోపించారు. ఫాం హౌస్‌లో కూర్చొని పాలన నడిపించే సీఎంను తన జీవితంలో చూడలేదన్నారు. ఉద్యమాల నేపథ్యంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇలా చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్, ఎంఐఎం, టీఆర్ఎస్ మూడు పార్టీలూ ఒక్కటేనని ఆరోపించారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ముకు వ్యతిరేకంగా పనిచేయడం ద్వారా.. కేసీఆర్ ఎస్టీలకు వ్యతిరేకమని తేలిపోయిందన్నారు. ప్రధాని మోదీ ప్రజల కోసం పనిచేస్తుంటే.. కేసీఆర్ కుటుంబీకులు విదేశాల్లో షికార్లు కొడుతున్నారని.. అక్కడ డబ్బులు దాచుకుంటున్నారని ఆరోపించారు. చేతిగాని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టమన్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
జంతు ప్రేమ అంటే ఇలానే ఉంటుంది.. మావటిని హగ్ చేసుకున్న పిల్ల ఏనుగు హార్ట్ టచ్చింగ్ వీడియో
గంగలోకి దూకిన 70 ఏళ్ల మహిళ.. ఆ తర్వాత ఏం చేసిందంటే ??
అక్కడ విమానంలోంచి చేపల వర్షం కురిపించారు !! అమేజింగ్ వీడియో
మందు కొట్టి పాముతో పరాచకాలు.. అది ఎక్కడ కాటేసిందో తెలుసా ??
వావ్ వండర్ హౌస్.. వరద వస్తే పైకి లేచే ఇళ్లు