KTR: రాహుల్‌, మోదీ కలిసి చర్చించుకుంటే అరగంటలో బిల్లు పాస్‌: కేటీఆర్ ఏమన్నారంటే..

Updated on: Aug 31, 2025 | 1:22 PM

తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది.. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై అందరూ ఒకే మాటపై ఉన్నారని..ఇది అసెంబ్లీలో తేలే అంశం కాదని రాహుల్‌ గాంధీ, మోదీ కలిసి చర్చించుకుంటే అరగంటలో బిల్లు పాస్‌ అవుతుందంటూ కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణ అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లపై అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది.. ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై అందరూ ఒకే మాటపై ఉన్నారని..ఇది అసెంబ్లీలో తేలే అంశం కాదని రాహుల్‌ గాంధీ, మోదీ కలిసి చర్చించుకుంటే అరగంటలో బిల్లు పాస్‌ అవుతుందంటూ కేటీఆర్ పేర్కొన్నారు. చట్టాల్లో లొసుగులు ఉంటే కచ్చితంగా కోర్టుకు వెళ్తారన్నారు. కేటీఆర్‌కు కౌంటర్‌ ఇచ్చిన మంత్రి పొన్నం.. కోర్టులపై తమకు అపారమైన నమ్మకం గౌరవం ఉన్నాయన్నారు. అంత గౌరవం ఉంటే పదిమంది ఎమ్మెల్యేలపై సుప్రీం తీర్పుని గౌరవించండంటూ కౌంటర్‌ ఇచ్చారు కేటీఆర్‌. ఈ విషయంలో స్పీకర్‌ నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. ఇప్పటివరకు సీఎం 52సార్లు ఢిల్లీకి వెళ్లారని.. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో కూర్చుని..ఆమరణ నిరాహార దీక్ష చేయాలంటూ కేటీఆర్‌ సూచించారు.