CM Stalin: సిటీ బస్సులో ప్రయాణించిన సీఎం స్టాలిన్‌.. వీడియో

|

Oct 28, 2021 | 9:20 AM

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తనదైన శైలిలో పాలన కొనసాగిస్తూ ఇతర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎక్కడ ఎవరు కష్టంలో ఉన్నా నేనున్నానంటూ వారికి అండగా నిలుస్తున్నారు.

YouTube video player

తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ తనదైన శైలిలో పాలన కొనసాగిస్తూ ఇతర ముఖ్యమంత్రులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎక్కడ ఎవరు కష్టంలో ఉన్నా నేనున్నానంటూ వారికి అండగా నిలుస్తున్నారు. స్టాలిన్‌ తీసుకునే నిర్ణయాలు, చేపట్టే పథకాలను విపక్ష నేతలు సైతం మెచ్చుకుంటున్నారు. తాజాగా సీఎం స్టాలిన్‌ సిటీబస్సులో ప్రయాణించారు. చెన్నై కన్నగి నగర్లో కాన్వాయ్‌లో వెళ్తూ సీఎం స్టాలిన్‌ సడన్‌గా కాన్వాయ్‌ని ఆపేసి సిటీ బస్సు ఎక్కారు. సడన్‌గా బస్సు ఎక్కిన ముఖ్యమంత్రిని చూసి ప్రయాణికులు షాకయ్యారు. అయితే కన్నగి నగర్‌ నుంచి ప్రభుత్వ బస్సులో సామాన్య ప్రయాణికులతో కలిసి ప్రయాణించిన సీఎం, మహిళలకు ఉచిత బస్సు సర్వీసుపై మహిళలను అడిగి తెలుసుకున్నారు. డ్రైవర్‌, కండక్టర్‌ల పనితీరుపై ఆరా తీసారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

Viral Video: బాతుగా పుట్టిన మైకెల్ జాక్సన్… బాతు మూన్‌ వాక్‌కి ఫిదా అవుతున్న ఫాన్స్…. వీడియో

News Watch: హుజురాబాద్ లో ఓటుకు ఎంతిస్తున్నారో తెలుసా… మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్