Sajjala: వై నాట్ 175 స్లోగన్ వెనుక మా ధీమా అదే.: సజ్జల

|

Mar 25, 2024 | 8:44 PM

టీవీ9 క్రాస్‌ ఫైర్‌లో ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్‌ ఇప్పుడు పొలిటికల్‌గా కాక పుట్టిస్తున్నాయి. గెలుపుపై వందశాతం ధీమాతో ఉన్నట్లు ఆయన తెలిపారు. 87శాతం మందికి సంక్షేమం అందించామంటున్నారు. ప్రతీ నియోజకవర్గంలో కనీసం 50 శాతం ఓట్లు మాకే అని ధీమాగా చెబుతున్నారు.

ఏపీ లాంటి రాష్ట్రంలో 175కు 175 సీట్లు గెలవడం ఏ పార్టీకైనా సాధ్యమా..? కులాలు ప్రాబల్యం, వివిధ సమీకరణాలు అధిక ప్రభావితం చేసే రాష్ట్రంలో ఈ టార్గెట్‌ను ఏ రకంగా చూడాలి అని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలను ప్రశ్నించారు టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్. అది పూర్తి రియాలిటీతో అన్న మాటే అని చెప్పారు సజ్జలు. వై నాట్ 175 అని టార్గెట్ పెట్టుకుంది అందుకే అన్నారు. తాము చేసిన పనులు, సంక్షేమం అందుకున్న లబ్ధిదారుల వల్లే తమకు ఆ నమ్మకమన్నారు. సీఎం జగన్ చెప్పినదానికంటే ఎక్కువే చేశారని.. మిగతా అంతా ఎలక్షన్ మేనేజ్‌మెంట్ చేసుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులదే అన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..  

 

Follow us on