చిరాగ్ పాశ్వాన్ గెలుపు.. పవన్‌తో పోల్చుతున్న నెటిజన్లు వీడియో
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు యువనేత చిరాగ్ పాశ్వాన్ రాజకీయ ఆవిర్భావానికి వేదికైంది. తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ కు తగ్గ తనయుడని నిరూపించారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు ఎన్డీయే కూటమితో జతకట్టిన లోక్ జనశక్తి పార్టీ 29 స్థానాల్లో పోటీకి దిగగా 21 స్థానాల్లో ఆధిక్యంలోకి వచ్చారు. 72 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయాన్ని నమోదు చేశారు.
గతేడాది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన పార్టీ ఇలాగే బీజేపీ, టీడీపీతో జతకట్టి 21 స్థానాల్లో పోటీచేసి వందశాతం గెలుపును సొంతం చేసుకుంది. చిరాగ్ పాశ్వాన్ పార్టీ LJP కూడా జనసేన లాగా రాజకీయాల్లో పుంజుకుంటోందని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. గతేడాది లోక్ సభ ఎన్నికల్లోనూ ఐదు స్థానాల్లో పోటీ చేయగా, 5 స్థానాల్లోనూ విజయం సాధించారు. 2020 అసెంబ్లీ ఎన్నికల సమయంలో .. జేడీయూతో విబేధాల కారణంగా ఒంటరిగా పోటీకి దిగారు చిరాగ్. 137 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి.. ఒకే ఒక్క స్థానంలో గెలిచి ఘోర అవమానం పాలయ్యారు. రామ్ విలాస్ పాశ్వాన్ వారసత్వాన్ని ముందుకు నడిపించే సత్తా ఆయనకు లేదని రాజకీయ విశ్లేషకులు విమర్శించారు.
మరిన్ని వీడియోల కోసం :