Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అరెస్టు
టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో ఆయనకు 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చిన అనంతరం గుంటూరు పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ముందుగా ప్రయత్నించారు.
టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనకాపల్లి జిల్లా పరవాడ మండలం వెన్నెలపాలెంలో ఆయనకు 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చిన అనంతరం గుంటూరు పోలీసులు ఆయన్ని అరెస్టు చేశారు. ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు ముందుగా ప్రయత్నించారు. అయితే ఆయన తన ఇంటి తలుపులు తెరవకపోవకపోగా పోలీసులు హడావిడి చేశారు. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా నిరాహార దీక్ష చేస్తున్న సత్యనారాయణకు వైద్య పరీక్షలు చేయించేందుకు టీడీపీ నేతలు యత్నించారు. అలాగే ఆయన ఇంటికి తీసుకొచ్చిన ప్రైవేట్ అంబులెన్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. ఇక చివరికి టీడీపీ నేత ఇంటి తలుపులు బద్దలు కొట్టి.. 41ఏ, 41బీ సెక్షన్ల కింద నోటీసులు అందజేసి అరెస్టు చేశారు. అలాగే సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయనపై కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవల బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై చేసిన చేసిన వ్యాఖ్యలు వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో వైసీపీ నేతలు గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇప్పుడు తాజాగా ఆయన్ని అరెస్టు చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..