ప్రధాని మోదీ మాతృమూర్తి హీరాబెన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడానికి ఆమె ఇబ్బందిగా ఫీల్ కావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. అహ్మదాబాద్ లోని యూఎన్ మెహతా ఆస్పత్రిలో హీరాబెన్‌కు చికిత్స జరుగుతోంది. 100 ఏళ్ల హీరాబెన్ ఆకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. హీరాబెన్ హెల్త్‌బులెటిన్‌ను విడుదల చేశారు వైద్యులు. ఆమె ఆరోగ్యం స్థిరంగా ఉందని వెల్లడించారు.
అనారోగ్యంతో బాధపడుతున్న తన తల్లిని పరామర్శించడానికి ప్రధాని మోదీ అహ్మదాబాద్ వెళ్లే అవకాశముంది. యూఎన్ మెహతా ఆస్పత్రితో పాటు అహ్మదాబాద్‌లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో దశ పోలింగ్ రోజున తన తల్లిని కలిశారు మోదీ. ఆమెతో అప్యాయంగా గడిపారు. ఈ ఏడాది జూన్‌లో హీరాబెన్ తన 100వ జన్మదినాన్ని జరుపుకున్నారు.