Narendra Modi: 77 అడుగుల ఎత్తయిన రాముడి కాంస్య విగ్రహం.. ఆవిష్కరించిన ప్రధాని
గోవాలో 77 అడుగుల ఎత్తైన రాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. గోకర్ణ జీవోత్తమ మఠంలో నెలకొల్పిన ఈ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన రాముడి విగ్రహంగా నిలిచింది. ఈ విగ్రహం ఆవిష్కరణతో గోవా ఇకపై ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా కూడా మారనుంది. గోవాలో ప్రపంచంలోనే ఎత్తైన 77 అడుగుల శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
గోవాలో ప్రపంచంలోనే ఎత్తైన 77 అడుగుల శ్రీరాముడి కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. గోకర్ణ జీవోత్తమ మఠం ప్రాంగణంలో ప్రతిష్టించిన ఈ విగ్రహం గోవాకు కొత్త ఆధ్యాత్మిక ఆకర్షణను తెచ్చింది. ఇంతకాలం బీచ్‌లు, పండుగలకు ప్రసిద్ధి చెందిన గోవా, ఇప్పుడు ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా కూడా మారబోతోంది. ఈ కార్యక్రమంలో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, గవర్నర్ అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు. 550వ వార్షికోత్సవం సందర్భంగా పార్టిగల్ జీవోత్తం ఆశ్రమం ఒక ఎకరం స్థలంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. స్టాట్యూ ఆఫ్ యూనిటీని రూపొందించిన రాజా సుతార్ ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. కేవలం ఒక సంవత్సరంలోపే విగ్రహ నిర్మాణం పూర్తి కావడం విశేషం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఊరంతా ఒకే చోటే భోజనం వందల ఏళ్ల నాటి సంప్రదాయం ??
TOP 9 ET News: స్పిరిట్ లో చిరు.. పక్కా సమాచారం..?
Kaantha OTT: అప్పుడే OTTలోకి కాంతా మూవీ
ఎటు చూసినా నీళ్లే.. శ్రీలంకను ముంచిన వరుణుడు
చనిపోయిన తల్లిలా వేషం వేసిన కొడుకు.. మూడేళ్లుగా రూ. 80 లక్షల పింఛను కోసం నాటకం
