PM Modi apologies: నా మనస్సాక్షి ఒప్పుకోవడం లేదు.. నన్ను క్షమించండి..! ప్రధాని మోదీ క్షమాపణలు..
రాజస్థాన్లోని సిరోహిలో పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. బహిరంగ సభ వేదికకు చాలా ఆలస్యంగా చేరుకున్నారు. అప్పటికి రాత్రి పది దాటుతోంది. ప్రసంగించేందుకు మైక్ తీసుకుని సమయం చూసుకున్నారు..
ఇంటరెస్టింగ్ స్పీచ్ ఇస్తారనుకుని బహిరంగ సభకు తరలి వచ్చిన ప్రజలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ షాకిచ్చారు. తాను ప్రసంగించనంటూ మైక్ తీసి పక్కన పెట్టారు. భారత్ మాతాకీ జై అన్న నినాదం చేస్తూ వేదికను వీడారు.. వినడానికిది ఆశ్చర్యంగా వున్నా ఇది అక్షరాలా నిజం. ప్రధాని తన రాజస్థాన్ పర్యటనలో ఇలా చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇపుడు వైరలవుతోంది. రాజస్థాన్లోని సిరోహిలో పర్యటనకు వెళ్లారు ప్రధాని నరేంద్ర మోదీ. బహిరంగ సభ వేదికకు చాలా ఆలస్యంగా చేరుకున్నారు. అప్పటికి రాత్రి పది దాటుతోంది. ప్రసంగించేందుకు మైక్ తీసుకుని సమయం చూసుకున్నారు.. ఈ సమయంలో ప్రసంగించడం నిబంధనలకు విరుద్దమంటూ మైక్ తీసి పక్కన పెట్టారు. సభకు వచ్చిన ప్రజలకు చేతులు జోడించి క్షమాపణలు తెలియజేశారు. అయితే, నిబంధనలకు అనుగుణంగా ఆయన వ్యవహరించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నారు. అంతకుముందు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల అబు రోడ్‌లో బీజేపీ నిర్వహించిన ర్యాలీకి చాలా ఆలస్యంగా చేరుకున్నారు. రాత్రి 10 గంటలు దాటిపోయింది. రాజస్థాన్‌లో 10 గంటలు దాటిన తర్వాత మైక్‌లు, లౌడ్ స్పీకర్లపై నిషేధం అమలులో ఉంది. దీంతో నిబంధనలకు లోబడి ఆయన సభలో ప్రసంగించలేదు. నిబంధనలు అతిక్రమించి ప్రసంగం చేయడానికి తన మనస్సాక్షి ఒప్పుకోవడం లేదని మోదీ అన్నారు. దయచేసి తనను క్షమించాలని అక్కడికి భారీగా తరలివచ్చిన బీజేపీ కార్యర్తలను, అభిమానులను కోరారు. ఇంకో సందర్భంలో అక్కడికి తప్పక వస్తానని హామీ ఇచ్చి వేదిక వీడారు. ఇప్పుడు చూపించిన ప్రేమ, అభిమానానికి రుణం చెల్లిస్తానని హామీ ఇచ్చారు. ‘భారత్ మాతాకీ జై’ అంటూ వేదిక దిగిపోయారు. ఇదంతా స్టేజీపై మైక్ లేకుండా సాధారణంగా మాట్లాడారు మోదీ. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్‌గా మారింది. దేశవ్యాప్తంగా మోదీ నిజాయితీని కొనియాడారు. ప్రధాని హోదాలో ఉండి కూడా ఆయన వ్యవహరించిన తీరుపై ప్రశంసలు కురిపించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..