Republic Day 2023: ఢిల్లీలో గణతంత్ర వేడుకలు.. రాష్ట్రపతిగా తొలిసారిగా జాతీయ జెండాను ఎగుర వేస్తున్న ద్రౌపది ముర్ము..(లైవ్)

|

Jan 26, 2023 | 11:16 AM

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా జాతీయ జెండాను ఎగుర వేస్తారు. జాతీయ గీతం ఆలపించాక పరేడ్ జరుగుతుంది. కర్తవ్యపథ్‌లో జరిగే ఆర్మీ

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి హోదాలో తొలిసారిగా జాతీయ జెండాను ఎగుర వేస్తారు. జాతీయ గీతం ఆలపించాక పరేడ్ జరుగుతుంది. కర్తవ్యపథ్‌లో జరిగే ఆర్మీ పరేడ్‌లో..త్రివిధ దళాలు పాల్గొంటాయి. త్రివిధ దళాల సైనికులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చక్ర అవార్డులు ప్రదానం చేస్తారు. తర్వాత త్రివిధ దళాలు, పారా మిలటరీ బలగాలు, NCC, NSS పరేడ్‌ ప్రారంభం అవుతుంది. విజయ్‌ చౌక్‌ నుంచి ప్రారంభమయ్యే ఈ పరేడ్‌ ఎర్ర కోట వరకు సాగుతుంది.దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ పరేడ్‌ జరగనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన యుద్ధ ట్యాంకులు..ఈసారి పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ఈ సారి పరేడ్​లో 17 రాష్ట్రాలు, యూటీల శకటాలు, 6 కేంద్ర మంత్రిత్వ శాఖ శకటాల ప్రదర్శన ఉంటుంది.కామన్‌ పీపుల్‌ థీమ్‌తో ఈ వేడుకలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్తవ్య పథ్, సెంట్రల్ విస్టా నిర్మాణంలో కూలీలుగా పని చేసిన కార్మికులను వీవీఐపీలుగా గుర్తిస్తూ మొదటి వరుస సీట్లను కేటాయించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

UK’s PM office Pongal: వాహ్వా..! యూకే ప్రధాని కార్యాలయంలో పొంగల్ విందు భోజనాలు..! ఖండాలు దాటినా తెలుగు సంప్రదాయం..

Wife Murder: వీడేం మొగుడు.. భార్య అందంగా ఉందని చంపేసిన భర్త.. పెళ్లైన ఆరు నెలలకే..!

TOP 9 ET News: NTR or Charan ఈ రోజు తేలిపోవాలంతే! | డబ్బులిచ్చి అవార్డులు గెలవలేరు భయ్యా.!

Follow us on