Pawan Kalyan: పిఠాపురానికి అప్పుడే వెళతా.! కానీ.. ఒక షరతు.. : పవన్ కళ్యాణ్.

|

Jun 15, 2024 | 8:08 PM

తనను అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతర జూన్ 20 తర్వాత పిఠాపురానికి వస్తానని చెప్పారు. ఈలోపు శాసనసభ సమావేశాలు కూడా ఉన్నాయని, వీటిని పూర్తి చేసుకుని పిఠాపురం వస్తానని పవన్‌ తెలిపారు. ఈ నెల 20తర్వాత పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలను కలుస్తానని,

తనను అఖండ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు పవన్‌ కల్యాణ్‌ అభినందనలు తెలిపారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతర జూన్ 20 తర్వాత పిఠాపురానికి వస్తానని చెప్పారు. ఈలోపు శాసనసభ సమావేశాలు కూడా ఉన్నాయని, వీటిని పూర్తి చేసుకుని పిఠాపురం వస్తానని పవన్‌ తెలిపారు. ఈ నెల 20తర్వాత పిఠాపురం నియోజకవర్గ కార్యకర్తలను కలుస్తానని, ఆ తర్వాత దశల వారీగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని చెప్పారు. తనను నేరుగా కలిసి అభిననందించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశిస్తున్నారని, త్వరలోనే వారందరినీ కలిసి మాట్లాడతానని అన్నారు. అభినందనలు తెలియజేడానికి వచ్చేవారు పూల బోకేలు, శాలువాలు తీసుకురావద్దని పవన్‌ విజ్ఞప్తి చేశారు.

ఎన్డీయే కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆనందం వ్యక్తం చేశారు. తన ఆనందాన్ని ఎక్స్‌ వేదికగా పంచుకున్న ఆయన, కూటమి హామీలపై సీఎం చంద్రబాబు సంతకాలు చేసిన అంశాన్ని పోస్టు చేశారు. 16 వేల 347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ ఫైల్‌ మీద తొలి సంతకం. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రద్దుపై రెండోసంతకం. సామాజిక పింఛన్లు 4 వేల రూపాయలకు పెంచుతూ మూడో సంతకం. అన్న క్యాంటీన్లు పునరుద్ధరిస్తూ నాలుగో సంతకం. యువతలో నైపుణ్యాలు గురించి వారికి బంగారు భవిష్యత్తు అందించేందుకు స్కిల్‌ సెన్స్‌సపై ఐదో సంతకం చేశారు అని ఎక్స్‌లో రాసుకొచ్చారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on