పవన్ కల్యాణ్ జనసేన అభ్యర్థుల రెండో జాబితాపై ఫోకస్ పెట్టారు. ఇప్పటికే మంగళగిరి ఆఫీసులో బిజీబిజీగా గడుపుతున్న జనసేన అధినేత పవన్.. అభ్యర్థుల జాబితాపై ఓవైపు కసరత్తులు చేస్తూనే పార్టీలో చేరికలను ప్రొత్సహిస్తున్నారు. కాగా.. ఇప్పటిదాకా ఆరు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది జనసేన. ఇవాళ ప్రకటించబోయే లిస్ట్‌లో దాదాపు అన్ని స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పవన్ పోటీ చేసే స్థానంపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అరు చోట్ల అభ్యర్థులను ప్రకటించిన పవన్.. నిన్నటి చర్చల్లో మరో 9 స్థానాల్లో అభ్యర్థులను దాదాపు ఖరారు చేశారు. అవనిగడ్డ, పిఠాపురం, పాలకొండ, రైల్వే కోడూరు, ఏలూరు, రామచంద్రపురం స్థానాలపై తుది దశలో కసరత్తు చేయనున్నారు. ఈ క్రమంలో మిగతా నియోజకవర్గాలపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాగా.. విజయవాడ వెస్ట్ సీటులో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..