Chandrababu – Pawan Kalyan: త్వరలోనే అభ్యర్థుల ప్రకటన..! చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ..

Updated on: Feb 04, 2024 | 1:13 PM

తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు ప్రారంభమయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. అమరావతిలోని ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. గత నెల 13 న ఇద్దరు నేతలు చివరిసారిగా భేటీ అయ్యారు.

తెలుగుదేశం, జనసేన అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు ప్రారంభమయ్యాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి భేటీ అయ్యారు. అమరావతిలోని ఉండవల్లిలో చంద్రబాబు నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్.. చంద్రబాబుతో భేటీ అయ్యారు. గత నెల 13 న ఇద్దరు నేతలు చివరిసారిగా భేటీ అయ్యారు. తాజా భేటీలో అభ్యర్థుల ప్రకటన, మేనిఫెస్టో తదితర కీలక అంశాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. సీట్ల సర్దుబాటుపై ఇప్పటికె స్పష్టతకు వచ్చిన ఇరువురు నేతలు.. అభ్యర్థుల ఎంపిక, మేనిఫెస్టోపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Feb 04, 2024 01:12 PM