Andhra Pradesh: చింతమనేని ప్రభాకర్‌కు DSP అశోక్ వార్నింగ్
వీరమ్మకుంట పంచాయతీ ఉప ఎన్నిక సందర్భంగా.. పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు చింతమనేని ప్రయత్నించారు. రౌడీషీటర్‌ను పోలింగ్ కేంద్రానికి రానివ్వమంటూ ఖరాఖండీగా చెప్పేశారు డీఎస్పీ. ఈ సమయంలో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. నేను రౌడీషీటర్‌ను అయితే..ఎందుకు ముందే బైండోవర్ చేయలేదని చింతమనేని ప్రశ్నించారు. కాగా ఇటీవల ఇదే డీఎస్పీకి టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగంగా వార్నింగ్ ఇవ్వడం కూడా వైరల్ అయ్యింది.
దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు నూజివీడు డిప్యూటీ సూపరింటెండెంట్ అశోక్‌కుమార్ గౌడ్ వార్నింగ్ ఇచ్చారు. వీరమ్మకుంట పంచాయతీ ఉప ఎన్నిక సందర్భంగా.. పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు చింతమనేని ప్రయత్నించారు. రౌడీషీటర్‌ను పోలింగ్ కేంద్రానికి రానివ్వమంటూ ఖరాఖండీగా చెప్పేశారు డీఎస్పీ. ఈ సమయంలో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. నేను రౌడీషీటర్‌ను అయితే..ఎందుకు ముందే బైండోవర్ చేయలేదని చింతమనేని ప్రశ్నించారు. చివరకు చింతమనేనిని అడ్డుకుని వెనక్కి పంపారు డీఎస్పీ. గత ఏడాది నవంబర్‌లో నూజివీడు డిప్యూటీ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన రాజమహేంద్రవరం ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేశారు. కాగా ఇటీవల ఇదే డీఎస్పీకి టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగంగా వార్నింగ్ ఇవ్వడం కూడా వైరల్ అయ్యింది.