News Watch Live: ఆవేదనే ఆగ్రహమై..అందరూ చూస్తుండగానే హత్య..? వీక్షించండి న్యూస్ వాచ్..

|

Apr 26, 2023 | 8:00 AM

ప్రేమ పేరుతో వేధిస్తున్న యవకుడిని బండరాయితో కొట్టి చంపారు యువతి, ఆమె కుటుంబసభ్యులు. యువకుడి తలను రాయితో ఛిద్రం చేసి అత్యంత దారుణంగా కడతేర్చారు. యువతి.. తండ్రి, తల్లి, తమ్ముడు కలిసి యువకుడిని కొట్టి చంపారు.

తెలంగాణలో భయానక సంఘటన చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వేధిస్తున్న యవకుడిని బండరాయితో కొట్టి చంపారు యువతి, ఆమె కుటుంబసభ్యులు. యువకుడి తలను రాయితో ఛిద్రం చేసి అత్యంత దారుణంగా కడతేర్చారు. యువతి.. తండ్రి, తల్లి, తమ్ముడు కలిసి యువకుడిని కొట్టి చంపారు. ఈ భయానక ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో జరిగింది. నడిరోడ్డుపైనే జరిగిన ఈ దారుణ ఘటన తెలంగాణలో కలకలం రేపింది. మహేష్‌ అనే 25 ఏళ్ల యువకుడు కూతురిని వేధిస్తుండటంతో యువతి కుటుంబసభ్యులు చంపినట్లు పేర్కొంటున్నారు. గతంలోనే మహేష్ పై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా వేధింపులు ఆగకపోవడంతో ఈ ఘటనకు పాల్పడ్డారు. ఈ మర్డర్‌ జరుగుతున్నప్పుడు చుట్టుపక్కల వాళ్లు వీడియో తీయడంతో ఇది వెలుగు చూసింది.. యువతి కుటుంబం మహేష్‌ను కొట్టి చంపుతుంటే చుట్టుపక్కల వాళ్లు కూడా ఆపే ప్రయత్నం చేయలేదు. మహేష్‌ స్థానికులకు తెలిసినవాడే అయినా ఎవరూ ఈ దారుణాన్ని ఆపేందుకు ముందుకు రాలేదు. నడిరోడ్డుపై యువతి, ఆమె తల్లితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు మహేష్ ను చంపుతున్న దృశ్యాలు వీడియోలో రికార్డయ్యాయి. బండరాయితో మోది చంపే ముందు మహేష్‌పై కత్తితో దాడి చేశారు. ఈ విషయం బయటకు రావడంతో వెంటనే పోలీసులు స్పాట్‌కి చేరుకుని.. పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Published on: Apr 26, 2023 08:00 AM