News Watch LIVE : ఇదే నా రాష్ట్రం..ఇక్కడే నా నివాసం | తెలుగుజాతి కోసం ఆడా ఉంటా..ఈడా ఉంటా..(Video)
ఇక్కడే ఉంటా, ఇక్కడే రాజకీయం చేస్తా, ఇక్కడి ప్రజల సంతోషమే నా విధానం అంటూ తేల్చి చెప్పారు ఏపీ సీఎం జగన్. ఇటీవల ఖమ్మంలో టీడీపీ అధినేత చంద్రబాబు సభ పెట్టిన నేపథ్యంలో తాము ఏపీలోనే ఉంటామని స్పష్టమైన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి.
ఇక్కడే ఉంటా, ఇక్కడే రాజకీయం చేస్తా, ఇక్కడి ప్రజల సంతోషమే నా విధానం అంటూ తేల్చి చెప్పారు ఏపీ సీఎం జగన్. ఇటీవల ఖమ్మంలో టీడీపీ అధినేత చంద్రబాబు సభ పెట్టిన నేపథ్యంలో తాము ఏపీలోనే ఉంటామని స్పష్టమైన ప్రకటన చేశారు ముఖ్యమంత్రి. చంద్రబాబులా ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అని తాము చెప్పడం లేదని, పవన్‌లా ఈ భార్య కాకపోతే, ఆ భార్య అని చెప్పడం లేదని సెటైర్లు వేశారు. ప్రతి మనిషికీ మంచి చేస్తే చనిపోయిన తర్వాత కూడా బతికే ఉంటామని, దాని కోసమే తాను తాపత్రయపడుతున్నానని వ్యాఖ్యానించారు సీఎం జగన్. కడప జిల్లా టూర్‌లో సీఎం జగన్ చేసిన కీలక ప్రకటన ఇప్పుడు బాబును డిఫెన్స్‌లో పడేసింది. తాము ఏపీలోనే రాజకీయం చేస్తామని తమ విధానాన్ని తేల్చి చెప్పారు. చంద్రబాబులా తాము మాట్లాడబోమన్నారు.
Published on: Dec 24, 2022 07:31 AM