Nara Lokesh: సిట్ కార్యాలయంలో నారా లోకేష్.. సాయంత్రం వరకు విచారించనున్న సీఐడీ
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకు హాజరైయ్యారు నారా లోకేష్. ఐఆర్‌ఆర్ కేసులో అక్రమాలు జరిగాయంటూ 2022లో కేసు నమోదైంది. ఈ కేసులో ఏ 14గా ఉన్నారు లోకేష్. సాయంత్రం 5 గంటల వరకు.. లోకేష్‌ను న్యాయవాది సమక్షంలో విచారించనున్నారు అధికారులు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‌ను ఏ-14గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో ఫైల్ చేసింది. ఈ క్రమంలో ఢిల్లీలో ఉన్న లోకేష్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సీఐడీ నోటీసులిచ్చింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో సీఐడీ విచారణకు హాజరైయ్యారు నారా లోకేష్. ఐఆర్‌ఆర్ కేసులో అక్రమాలు జరిగాయంటూ 2022లో కేసు నమోదైంది. ఈ కేసులో ఏ 14గా ఉన్నారు లోకేష్. సాయంత్రం 5 గంటల వరకు.. లోకేష్‌ను న్యాయవాది సమక్షంలో విచారించనున్నారు అధికారులు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్‌ను ఏ-14గా పేర్కొంటూ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో ఫైల్ చేసింది. ఈ క్రమంలో ఢిల్లీలో ఉన్న లోకేష్‌కు సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద సీఐడీ నోటీసులిచ్చింది. ఈనెల 4న విచారణకు హాజరుకావల్సిందిగా నోటీసులిచ్చింది. నోటీసులో హెరిటేజ్ బోర్డ్ తీర్మానాలు, అకౌంట్ బుక్స్ తీసుకువాలని సూచించింది. అయితే ఈ నోటీసులపై హైకోర్ట్‌ను ఆశ్రయించారు లోకేష్. దీంతో హెరిటేజ్ తీర్మానాలు, అకౌంట్స్ బుక్స్ కి సంబంధించి ఎలాంటి ఒత్తిడి చేయొద్దని హైకోర్ట్.. సీఐడీకి ఆదేశాలిచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్‌లో ఇష్టానుసారంగా మార్పులు చేసి అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలున్నాయి. మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రులు లోకేశ్, పొంగూరు నారాయణ కలసి అసైన్డ్ భూములను కొల్లగొట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. సీఆర్‌డీఏ అధికారులు 94 కిలోమీటర్ల పొడవుతో అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ రూపొందించారు. మొదటి అలైన్‌మెంట్ ప్రకారం ఇన్నర్ రింగ్ రోడ్డు అమరావతిలోని పెద్దపరిమి, నిడమర్రు, చిన వడ్లపూడి, పెద వడ్లపూడి మీదుగా వెళ్తుంది. ఇందులో అక్రమాలు జరిగాయని సీఐడీ ఆరోపిస్తుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కడ మొదటి హైడ్రోజన్ రైలు.. ఒక్క ట్యాంక్ తో 1000 కి.మి.
నడిరోడ్డుపై యోగా చేసి వీడియో పోస్ట్ చేసిన యువతి.. పోలీసులు ఏం చేశారంటే ??
సైబర్ నేరగాళ్ల భారీ స్కెచ్ !! పేమెంట్ గేట్ వే నుంచి రూ.వేల కోట్లు చోరీ !!
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.. పోలీసులు ఏం చేశారో తెలుసా ??