CBN Arrest: దేవాన్ష్‌ రిపోర్ట్ చదివినా ఆ విషయం చెబుతాడు.. చంద్రబాబు అరెస్ట్‌పై నారా బ్రాహ్మణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్‌

|

Sep 16, 2023 | 8:56 PM

చంద్రబాబు నాయుడి అరెస్ట్ ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనని ఆమె ఈ సందర్భంగా అన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయన నేపథ్యంలో చంద్రబాబు యాత్రలకు, నారా లోకేష్‌ పాదయాత్రకు పెద్ద ఎత్తున వస్తున్న ప్రజాదారణ చూసి భయపడే వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు వేసిందని ఆరోపించారు. ఎలాంటి సాక్ష్యం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు...

ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్ట్‌పై నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలంగాణతోపాటు, బెంగళూరులో ఐటీ ఉద్యోగులు నిరసన తెలుపుతోన్న విషయం తెలిసిందే. ఇక ఏపీ వ్యాప్తంగా రోజురోజుకీ నిరసనలు ఉదృతమవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా రాజమండ్రిలో టీడీపీ క్యాండీల్‌ ర్యాలీ నిర్వహించింది. చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా చేపట్టి ఈ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలతో పాటు నారా లోకేష్‌ భార్య బ్రాహ్మణి, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి కూడా హాజరయ్యారు. క్యాండీల్‌ ర్యాలీలో పాల్గొన్న తర్వాత నారా బ్రాహ్మణి మీడియాతో మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు నాయుడి అరెస్ట్ ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనని ఆమె ఈ సందర్భంగా అన్నారు. ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నాయన నేపథ్యంలో చంద్రబాబు యాత్రలకు, నారా లోకేష్‌ పాదయాత్రకు పెద్ద ఎత్తున వస్తున్న ప్రజాదారణ చూసి భయపడే వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు వేసిందని ఆరోపించారు. ఎలాంటి సాక్ష్యం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారన్నారు. 8 ఏళ్ల తన బాబు దేవాన్షన్‌ రిమాండ్‌ రిపోర్ట్‌ను చదివినా ఇందులో సాక్ష్యం ఎక్కడుందని ప్రశ్నిస్తారంటూ బ్రాహ్మణి చెప్పుకొచ్చారు. కేసులో సరైన ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారంటూ ఆమె విరుచుకుపడ్డారు.

Published on: Sep 16, 2023 08:21 PM