కరీంనగర్‌లో ఎన్నికల ప్రచారం.. బహిరంగ సభలో పాల్గొన్న కేటీఆర్
Telangana Elections 2023: కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులపై ప్రసంగిస్తూ.. విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. 2018 ఎన్నికల్లో 88 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
కరీంనగర్‌లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారం కొనసాగుతోంది. అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్.. బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి పనులపై ప్రసంగిస్తూ.. విపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు. 2018 ఎన్నికల్లో 88 సీట్లతో బీఆర్ఎస్ పార్టీ గెలిచిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ పాలనలో కరీంనగర్ ఎంతగానో అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా సస్యశ్యామలంగా మారిందని చెప్పుకొచ్చారు. రూ.3వేల పెన్షన్.. రూ. 5వేలు కాబోతోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధును తీసుకొచ్చాం. బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో ఎక్కడా కూడా మత ఘర్షణలు జరగలేదని కేటీఆర్ తెలిపారు. సెంటిమెంట్‌తో ఎంపీగా గెలిచి బండి సంజయ్ ఏం సాధించారని ప్రశ్నించారు.
అంబానీ సంపద ఖర్చు చేయడానికి 555 ఏళ్లు !!
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు

