Komatireddy Venkat Reddy: నల్గొండ లో చేరికలు అవసరం లేదు.. మాకు 12 స్థానాలకు 12 మంది ఉన్నారు

Edited By:

Updated on: Jul 19, 2023 | 7:15 PM

రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండే ప్రత్యేకత వేరు. ఎప్పుడు ఏ సంచలన వ్యాఖ్యలు చేస్తారు ఎవరికీ అర్థం కాదు. అలాంటి కోమటిరెడ్డి మరోసారి అలాంటి ప్రకటన చేశారు. అయిన నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ లో భాగంగా మీడియాతో మాట్లాడారు కోమటిరెడ్డి.

రాజకీయాల్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉండే ప్రత్యేకత వేరు. ఎప్పుడు ఏ సంచలన వ్యాఖ్యలు చేస్తారు ఎవరికీ అర్థం కాదు. అలాంటి కోమటిరెడ్డి మరోసారి అలాంటి ప్రకటన చేశారు. అయిన నివాసంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు భేటీ లో భాగంగా మీడియాతో మాట్లాడారు కోమటిరెడ్డి. అదే సమయంలో మీడియా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరుతున్నారా అని అడిగారు… దీనికి కోమటిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. అదంతా మీడియా సృష్టి.. మా నల్గొండలో 12 కు 12 స్థానాల్లో కాంగ్రెస్ కు అభ్యర్థులు ఉన్నారు. కొత్తవారు అవసరం లేదని అన్నారు. వేముల వీరేశం కాంగ్రెస్ లో చేరడం కోమటిరెడ్డి కి ఇష్టం లేదు కానీ అయిన కొత్తవారు మా జిల్లా లో అవసరం లేదు అని అనడం తో మరి తమ్ముడు రాజ్ గోపాల్ రెడ్డి కూడా అవసరం లేదా అని అనుకుంటున్నారు..