KCR: ‘ఏపీలో మళ్లీ జగనే’.. కేసీఆర్ కీలక కామెంట్స్

Updated on: Apr 24, 2024 | 9:15 AM

ఏపీలో రాజకీయాల్లో ఏం జరిగినా తమకు పట్టింపు ఏమీ లేదన్నారు మాజీ సీఎం కేసీఆర్. మళ్లీ జగనే గెలిచే అవకాశం ఉందని తమకు సమాచారం ఉందన్నారు. ఒక రాజకీయ నాయకుడిగా అక్కడ..  ఎవరో ఒకరికి వత్తాసు పలకడం కరెక్ట్ కాదన్నారు కేసీఆర్.  ఆయనేమన్నారో వీడియోలో చూడండి...

ఏపీ రాజకీయాలపై కేసీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో మళ్లీ జగనే గెలుస్తారని సమాచారం ఉందన్నారు. ఎవరి అదృష్టం బాగుంటే వారే గెలుస్తారని చెప్పారు. ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకోనని చెప్పారు. ఏపీలో ఎవరు గెలిచినా తమకు ఇబ్బంది లేదన్నారు. బీఆర్‌ఎస్ ఏపీ రాజకీయాల్లో ఇప్పుడేం ఇంటర్‌ఫియర్ అవ్వదని.. రాబోయే రోజుల్లో దాని గురించి ఆలోచిస్తామని కేసీఆర్ చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..