తెలుగువాడైన సుదర్శన్ రెడ్డి గెలవాలి.. ఉపరాష్ట్రపతి ఎన్నికపై కవిత ఏమన్నారంటే..

Updated on: Sep 09, 2025 | 1:52 PM

బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండైన తర్వాత ఆ పార్టీకి వ్యతిరేకంగా కవిత తొలి నిర్ణయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్‌ నిలబెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి కవిత మద్దతు ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉంది.. ఈ క్రమంలో.. కవిత కీలక ప్రకటన చేశారు. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి గెలవాలని కవిత ఆకాంక్షించారు.

బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండైన తర్వాత ఆ పార్టీకి వ్యతిరేకంగా కవిత తొలి నిర్ణయాన్ని వెల్లడించారు. కాంగ్రెస్‌ నిలబెట్టిన ఉపరాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డికి కవిత మద్దతు ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ దూరంగా ఉంది.. ఈ క్రమంలో.. కవిత కీలక ప్రకటన చేశారు. ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్‌రెడ్డి గెలవాలని కవిత ఆకాంక్షించారు. ఆయన గెలిస్తే ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తెస్తారని కవిత పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా తెలుగువారు సుదర్శన్‌ రెడ్డిని గెలిపించాలని కవిత కోరారు. కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసని.. తమ జాగృతి భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని కవిత పేర్కొన్నారు.

Published on: Sep 09, 2025 01:48 PM