AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay: ఏ క్షణమైనా విజయ్ అరెస్ట్‌ ??

Vijay: ఏ క్షణమైనా విజయ్ అరెస్ట్‌ ??

Phani CH
|

Updated on: Sep 28, 2025 | 10:58 PM

Share

కరూర్‌లో విజయ్​ ప్రచారసభలో జరిగిన తొక్కిసలాటay 39 మందికి పైగా మృతి చెందారు. ఈ ఘటనలో విజయ్‌ను అరెస్ట్‌ చేస్తారా అన్న మీడియా ప్రశ్నకు సీఎం స్టాలిన్‌ స్పందించారు. అరెస్ట్‌పై ఇప్పుడే చెప్పలేనని అన్నారు. కాగా తాజా సమాచారం ప్రకారం టీవీకే ప్రధాన కార్యదర్శి బుస్సి ఆనంద్‌ సహా నలుగురి పై కేసు నమోదు చేసారు. TN- PPDL చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కరూర్‌లో ఈ కేసు నమోదైంది.

ఈ ఘటనపై డీజీపీ వెంకటరామన్ స్పందించారు. టీవీకే అధినేత ఆలస్యంగా రావడం వల్లే జనం పెరిగారని, విజయ్​ కోసం ఎండలోనే వేచి ఉన్నారని, వారికి తగినంత ఆహారం, నీరు అందకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని విలేకర్ల సమావేశంలో తెలిపారు. విజయ్ మధ్యాహ్నం 12 గంటలకు వేదికకు వస్తారని టీవీకే పార్టీ అధికారిక ఎక్స్​ ఖాతాలో ప్రకటించారనీ చెప్పారు. ట్వీట్​ సమాచారం తర్వాతే జనసందోహం పెరిగిందనీ ఉదయం 11 గంటల నుంచే జనాలు తరలివచ్చారనీ అన్నారు. సభకు అనుమతి సాయంత్రం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉంది అయితే విజయ్ రాత్రి 7.40కి వచ్చారు. ఆ సమయానికి జనాలు తగిన ఆహారం, నీరు లేక ఎండలో ఇబ్బంది పడ్డారు అని వెంకటరామన్ తెలిపారు. అయితే తమ ఉద్దేశం ఎవరినీ నిందించాలని కాదని, వాస్తవాలను మాత్రమే చెబుతున్నామని డీజీపీ వెంకటరామన్ అన్నారు. ‘విజయ్ వేదికకు చేరుకున్నప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు ఆయన వెంట నడిచారనీ ఆయనను పోలీసులు సురక్షితంగా వేదిక వద్దకు తీసుకువెళ్లారనీ తెలిపారు. విజయ్ కూడా పోలీసులను అభినందించారనీ కానీ జనాలు ఇంకా పెరుగుతూనే వచ్చారనీ సుమారు 10,000 మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేయగా వాస్తవానికి 27,000 మంది అభిమానులు విజయ్‌ను చూడటానికి వచ్చారనీ అన్నారు. సుమారు 20,000 మంది వస్తారని ఊహించి పోలీసులు రక్షణ కల్పించారనీ సభా ప్రదేశం పబ్లిక్ రోడ్ కావడం వల్ల ఎక్కువమంది పోలీసులను నియమిస్తే ప్రజలకు తగినంత స్థలం ఉండదనీ తెలిపారు. రెండు రోజుల క్రితం ఇదే ప్రదేశంలో అన్నాండీఎంకే సభ జరిగిందని డీజీపీ తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పంక్చరు షాపు నడిపే వ్యక్తి కూతురు.. ఇప్పుడు డీఎస్పీ

రైతుల పాలిట శాపంగా మారిన నత్తలు

నమ్మించారు.. వాట్సాప్‌ గ్రూప్‌లో చేర్పించారు..రూ.64 లక్షలు గాయబ్‌

కుంభమేళా మోనాలిసా ఇలా మారిపోయిందేంటి ??

అప్పు చెల్లించకుండా చనిపోయిన స్నేహితుడు.. కోపంతో శ్మశానంలోకి వచ్చి మరీ