బీఆర్ఎస్‌లో కవిత కుంపటి వెనుక రగులుతున్న రాజకీయం
బీఆర్ఎస్‌లో కవిత కుంపటి వెనుక రాజకీయం రగులుతోంది. కవిత తిరుగుబాటు వెనుక రేవంత్ ఉన్నారనేది బీఆర్ఎస్ వాదన. అయితే హరీష్, సంతోష్ వెనుక రేవంత్ ఉన్నారంటూ కవిత రివర్స్ అటాక్‌కు దిగింది. మరోవైపు ఇద్దరూ కలిసి డ్రామాలాడుతున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక చెత్తగాళ్ల వెనుక తానెందుకు ఉంటానంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ఈ నాలుగుస్తంభాల రాజకీయం రసవత్తరంగా మారింది. పార్టీ నుంచి కవిత బయటకొచ్చింది, మనసులో విషయం బయటపెట్టింది.. ఎవరో ఒక మనిషి వెనుక ఉండడం వల్లే ఇందతా అని బీఆర్ఎస్ అంటోంది. కానీ.. కవిత చెబుతోంది ఇంకాస్త డిఫరెంట్. హరీష్‌రావు, సంతోష్ వెనుక రేవంత్ ఉన్నారంటున్నారు ఆమె. గతంలో పార్టీ వీడిన నేతలందరూ వీళ్లిద్దరి వల్లనే అంటూ తేల్చేశారు కూడా. ఈ రెండు వెర్షన్స్‌కి రేవంత్ ఘాటు కౌంటరే ఇచ్చారు. ఉంటేగింటే నాయకుడిగా ప్రజల ముందు ఉంటానుగానీ ఎవరెవరి వెనకో తానెందుకు ఉంటానన్నారు. పార్టీ నుంచి సస్పెన్షన్ తర్వాత గులాబీబాస్‌కి సన్నిహితంగా ఉండే ఆ ఇద్దరిపైనే మాటల తూటాలు ఎక్కుపెట్టారు కవిత. హరీష్‌రావు, సంతోష్‌రావుపై తీవ్ర విమర్శలు చేశారు. నమ్మిన అధినేతను వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని, కల్వకుంట్ల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు కవిత. కలికాలంలో పెద్దాయన వారిని నమ్ముతున్నా.. మేకవన్నె పులుల నిజస్వరూపం త్వరలోనే బయటపడుతుందన్నారు. పార్టీలో నుంచి తనను తీసేయడం కాదు.. తానే పార్టీకి రాజీనామా చేస్తున్నానన్నారు కవిత. అంతేకాదు ఎమ్మెల్సీ పదవికీ రాజీనామా చేస్తూ.. స్పీకర్ ఫార్మాట్‌లో లేఖను పంపుతున్నానని చెప్పారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కవిత ఎపిసోడ్‌ని తెరపైకి తెచ్చారన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. కాళేశ్వరం అంశాన్ని డైవర్ట్ చేయడానికి డ్రామా చేస్తున్నారన్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణకు కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. కేసీఆర్ బిడ్డ కవితనే అవినీతి జరిగిందని చెప్పారని గుర్తు చేశారు. రెండేళ్లుగా ఈ కేసును సీబీఐకి ఎందుకివ్వలేదో రేవంత్ చెప్పాలన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
72 ఏళ్ల వయసులో క్లాస్‌రూమ్‌లో సెకండ్ ఇన్నింగ్స్
ఈ ఐఏఎస్‌కి.. ఫాలోయింగ్ ఎక్కువ గురు.. కారణం
మహిళలకు శుభవార్త.. ప్రతి ఒక్కరికి రూ.10 వేలు..
భూమిపైకి దూసుకొస్తున్న ఏలియన్స్ వ్యోమనౌక? నవంబర్‌లో ఏం జరగబోతుంది?