జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో.. హైవోల్టేజ్ పొలిటికల్ ఫైట్ వీడియో

Updated on: Oct 26, 2025 | 5:50 PM

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని బీఆర్ఎస్ బాకీ కార్డుతో విమర్శిస్తుంటే, బీజేపీ అవినీతి ఆరోపణలతో దూకుడు పెంచింది. హామీలను నిలబెట్టుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రజల కష్టాలు కాంగ్రెస్‌కు తెలుసని, రేవంత్ రెడ్డి విజయం ప్రతిపక్షాలకు తలనొప్పిగా మారిందని కాంగ్రెస్ బదులిచ్చింది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం తీవ్రస్థాయికి చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. బీఆర్ఎస్ బాకీ కార్డు పేరిట కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తుంటే, బీజేపీ స్కామ్‌లు, అవినీతి ఆరోపణలపై మౌనం వెనుక ఉన్న మర్మాన్ని ప్రశ్నించింది.బీజేపీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, మంత్రులు తమ వాటాల కోసం పోటీపడుతున్నారని, ఐఏఎస్ అధికారులను బలిపశువులను చేస్తున్నారని ఆరోపించారు. సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టకుండా, హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వానికి ఇంగిత జ్ఞానం లేదని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది.

మరిన్ని వీడియోల కోసం :

కర్నూలు బస్సు ప్రమాదం.. బస్సులో నో ఫైర్‌ సేఫ్టీ వీడియో

ఒక్కగానొక్క కొడుకు.. ఇక నేను ఎలా బతకాలి? వీడియో

ల్యాప్‌టాప్స్‌ చార్జింగ్‌ పెట్టడంతో వీడియో

Published on: Oct 26, 2025 05:50 PM