జగ్గంపేటలో టీడీపీ-జనసేన సమన్వయ సమావేశంలో ఉద్రిక్తత
ఈ వివాదంపై జ్యోతుల నెహ్రూ ఘాటుగా స్పందించారు. 25ఏళ్ల రాజకీయం జీవితంలో ఇలాంటి గొడవ చూడలేదన్నారు. రెండు కుటుంబాల గొడవని కావాలనే రాజకీయం చేశారన్నారు. జగ్గంపేట నుంచి తానే పోటీ చేస్తానని.. లేదు జనసేన బరిలో ఉన్నా.. గెలుపుకు కృషి చేస్తానన్నారు. సూర్యచంద్రకు టికెట్ ఇస్తే మాత్రం సపోర్ట్ చెయ్యనని నిర్మొహమాటంగా చెప్పారు నెహ్రూ.
కాకినాడ జిల్లా జగ్గంపేటలో టీడీపీ-జనసేన సమన్వయ సమావేశంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వేదికపైన, కింద పరస్పరం ఇరువర్గాల నాయకుల మధ్య తోపులాట జరిగింది. రెండురోజుల క్రితం గోకవరంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ వివాదంలో జనసేన కార్యకర్త కాలికి ఫ్రాక్చర్ అయ్యింది. ఆ కార్యకర్తకు క్షమాపణ చెప్పాలని సమన్వయ సమావేశంలో జనసేన ఇంచార్జ్ సూర్యచంద్ర కోరారు. తర్వాత కూర్చోబెట్టి మాట్లాడదామని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ. సారీ చెప్పాల్సిందేనని టీడీపీ నేతలతో వాగ్వాదానికి దిగారు సూర్యచంద్ర. దీంతోమాటామాట పెరిగి సమన్వయ సమావేశంలో తోపులాట జరిగింది.
ఈ వివాదంపై జ్యోతుల నెహ్రూ ఘాటుగా స్పందించారు. 25ఏళ్ల రాజకీయం జీవితంలో ఇలాంటి గొడవ చూడలేదన్నారు. రెండు కుటుంబాల గొడవని కావాలనే రాజకీయం చేశారన్నారు. జగ్గంపేట నుంచి తానే పోటీ చేస్తానని.. లేదు జనసేన బరిలో ఉన్నా.. గెలుపుకు కృషి చేస్తానన్నారు.
సూర్యచంద్రకు టికెట్ ఇస్తే మాత్రం సపోర్ట్ చెయ్యనని నిర్మొహమాటంగా చెప్పారు నెహ్రూ.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..