Pawan Kalyan: ‘తెలంగాణలో జనసేన జెండా ఎగరాలి..’ పవన్ కల్యాణ్ కీలక కామెంట్స్

Updated on: May 20, 2022 | 1:29 PM

చౌటుప్పల్ మండలం లక్కారంకు చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఇటీవల మృతి చెందిన పార్టీ కార్యకర్త సైదులు కుటుంబ సభ్యల్ని పరామర్శించిన పవన్.. వారికి 5 లక్షల రూపాయల చెక్ అందజేశారు.

2023లో జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని పవన్‌ కళ్యాణ్‌ ప్రకటించారు. అయితే పరిమిత సంఖ్యలోనే పోటీ చేస్తామని తెలిపారు. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం లక్కారం గ్రామంలో చనిపోయిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించారు. అధికారం చేపట్టలేము కాని, ప్రభావితం చేసే స్థాయిలో తమ పార్టీ ఉంటుందని పవన్ అన్నారు. తెలంగాణలో సామాజిక మార్పు రావాలని తాను కోరుకుంటానని జనసేత అధిపతి పవన్‌ కల్యాణ్ అన్నారు. కొత్త తరం నాయకత్వం రావాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు.

 

Published on: May 20, 2022 01:22 PM