IT Raids: తెలంగాణలో ఐటీ దాడుల కలకలం.. బీజేపీ ప్రమేయం లేదన్న కిషన్ రెడ్డి

|

Nov 02, 2023 | 1:56 PM

IT Raids in Hyderabad: కాంగ్రెస్ నాయకురాలు, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటిపై ఏకకాలంలో ఐటీ సోదాలు జరిగాయి. అటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు గిరిధర్‌రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. కోకాపేటలోని ఈడెన్‌ గార్డెన్‌లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.

తెలంగాణలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ నాయకురాలు, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి, బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి ఇంటిపై ఏకకాలంలో ఐటీ సోదాలు జరిగాయి. అటు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తోడల్లుడు గిరిధర్‌రెడ్డి ఇంట్లో కూడా ఐటీ సోదాలు నిర్వహిస్తున్నారు. కోకాపేటలోని ఈడెన్‌ గార్డెన్‌లో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గిరిధర్ రెడ్డి రియల్ ఎస్టేట్‌ బిజినెస్‌లో ఉన్నారు. ఉదయం నుంచి కేఎల్‌ఆర్‌, అతని బంధువుల ఇళ్లల్లో ఐటీ దాడులు జరిగాయి. సీఆర్పీఎఫ్ బలగాల పర్యవేక్షణలో బ్యాంక్‌ అధికారుల సమక్షంలో ఈ తనిఖీలు జరుగుతున్నాయి. నగదు, కీలక డాక్యుమెంట్లు సీజ్‌ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై ఐటీ అధికారులు ప్రకటన చేయాల్సి ఉంది. ఐటీ దాడులు కుట్రపూరితమని పారిజాత టీవీ9తో అన్నారు. మహేశ్వరం నుంచి కాంగ్రెస్‌ బీఫాం కోసం చూస్తున్నామని తెలిపారు. ఐటీ దాడుల వెనుక మంత్రి సబితా రెడ్డి ప్రమేయం ఉందని ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఓటమి భయంతో సబిత దాడులు చేయిస్తున్నారన్నారు. అయితే ఇలాంటి దాడులకు భయపడేది లేదన్నారు. రాజకీయంగా ఇలాంటి దాడులను ఎన్నైనా ఎదుర్కొంటామన్నారు.

కాగా తెలంగాణలో జరుగుతున్న ఐటీ దాడులతో బీజేపీకి సంబంధం లేదన్నారు..కిషన్‌రెడ్డి. ఐటీ అధికారులకు ఉన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహిస్తారని..అందులో ఎవరి ప్రమేయం ఉండదని స్పష్టం చేశారు.

Published on: Nov 02, 2023 01:37 PM