Telangana: రైతన్నలకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌

Updated on: Nov 15, 2025 | 10:39 AM

తెలంగాణ ప్రభుత్వం కూరగాయల కొరత తీర్చడానికి 2025-26 నుండి ఏటా 10,000 ఎకరాల్లో సాగు ప్రోత్సహిస్తుంది. రైతులకు ఎకరానికి రూ.9,600 సబ్సిడీని నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. దీనివల్ల 12.68 లక్షల టన్నుల లోటును పూడ్చి, కూరగాయల ఉత్పత్తిని పెంచడం, మార్కెట్లో ధరలు స్థిరీకరించడం లక్ష్యం.

రైతులకు ఇది నిజంగా గుడ్‌ న్యూస్‌ అని చెప్పాలి. రాష్ట్రంలో కూరగాయల కొరతను తగ్గిస్తూ స్థానిక అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి కొత్తగా 10 వేల ఎకరాల్లో కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు నిర్ణయం తీసుకుంది. రైతులపై భారం తగ్గించేందుకు ఎకరాకు రూ.9,600 సబ్సిడీని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 1.35 లక్షల ఎకరాల్లో 14.64 లక్షల టన్నుల కూరగాయల ఉత్పత్తి జరుగుతోంది. అయితే రాష్ట్రంలో దాదాపు 26 లక్షల టన్నుల కూరగాయల ఉత్పత్తి అవసరముంది. వ్యవసాయ విశ్వవిద్యాలయ సర్వే ప్రకారం.. 12.68 లక్షల టన్నుల లోటు ఉత్పత్తి ఉందని, ఈ లోటును పూడ్చేందుకు ప్రతి ఏడాది 10 వేల ఎకరాల్లో అదనపు సాగు చేపట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఉద్యానశాఖ అంచనా ప్రకారం ఎకరానికి విత్తనాలు, నారు, ఎరువులు, పురుగుమందులు, పోషక యాజమాన్యం వంటి ఖర్చులు కలిపి రూ.24,000 వరకూ ఉంటాయి. అందులో 40% సబ్సిడీగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంతో రైతులకు రూ.9,600 మద్దతు లభిస్తుంది. ఒక్కో రైతు గరిష్ఠంగా 2.5 ఎకరాల వరకు ఈ సబ్సిడీ పొందవచ్చు. టమాట, వంకాయ, బెండకాయ, క్యాబేజీ, కాలీఫ్లవర్, మిర్చి, బీర, క్యాప్సికం, చిక్కుడు, కాకర, దొండ, సొరకాయ వంటి పంటలు వేసే రైతులు స్థానిక ఉద్యానశాఖ అధికారుల వద్ద దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన తర్వాత సాగు ప్రారంభించిన వెంటనే ఉద్యానశాఖ గుర్తించిన నర్సరీల నుంచి నారు–విత్తనాలు కొనుగోలు చేస్తే, వారికి సబ్సిడీ మొత్తాన్ని నేరుగా ఖాతాలో జమ చేస్తారు. సిద్దిపేట ములుగు, హైద‌రాబాద్ జీడిమెట్లలో ఉన్న సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నర్సరీలు ఈ ప్రాజెక్ట్ కోసం నాట్లు సిద్ధం చేస్తున్నాయి. రైతులకు అవసరమైన విత్తనాలను కూడా ప్రభుత్వం తక్కువ ధరకు అందిస్తుంది. రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తి పెంచి మార్కెట్లలో ధరలను స్థిరంగా ఉంచేందుకు ఈ ప్రోత్సాహక పథకం కీలకమవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పెళ్లికి ఎక్స్‌పైరీ డేట్ ఉండాలి.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరోయిన్

వీడసలు టీచరేనా.. విద్యార్థినిని ఏమార్చి.. అలా ఎలా చేసాడు… చిన్న పిల్లరా

Divvela Madhuri: బిగ్ బాస్‌ విన్నర్‌ ఎవరో చెప్పేసిన మాధురి

ప్రేమ విషయంలో మరో హింట్‌ ఇచ్చిన జాన్వీ

అంతర్జాతీయ జాబితాలో సౌత్ సినిమాల హవా.. అట్లుంటది మనతోని