Harish Rao: రైతులకు మూడు గంటల కరెంట్ సరిపోతుందా..? హరీష్ రావు

|

Nov 12, 2023 | 4:31 PM

తెలంగాణకు తండ్రిలాంటి కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. రాజకీయాల్లో విలువలు ఉండాలన్నారు. ఈ రాష్ట్రం కేసీఆర్ చేతుల్లో ఉంటేనే బాగుపడుతుందన్నారు. కాంగ్రెస్ ఒక ముఠా చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. కాంగ్రెస్ చేతుల్లోకి రాష్ట్రం వెళ్లడం మంచిది కాదన్నారు. చావునోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చారని కీర్తించారు.

తెలంగాణకు తండ్రిలాంటి కేసీఆర్‌పై కాంగ్రెస్ పార్టీ అనుచిత వ్యాఖ్యలు చేస్తుందన్నారు మంత్రి హరీష్ రావు. రాజకీయాల్లో విలువలు ఉండాలన్నారు. ఈ రాష్ట్రం కేసీఆర్ చేతుల్లో ఉంటేనే బాగుపడుతుందన్నారు. కాంగ్రెస్ ఒక ముఠా చేతుల్లోకి వెళ్లిందని ఆరోపించారు. కాంగ్రెస్ చేతుల్లోకి రాష్ట్రం వెళ్లడం మంచిది కాదన్నారు. చావునోట్లో తలపెట్టి కేసీఆర్ తెలంగాణ తీసుకొచ్చారని కీర్తించారు. సమైఖ్య రాష్ట్రంలో ఢిల్లీలో అడుగుపెడుతున్నా.. తెలంగాణతోనే తిరిగి వస్తా అని చెప్పి బిల్లు పాస్ చేయించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ఆమరణ నిరాహార దీక్షలో పాల్గొని అయితే నా శవ యాత్ర.. లేకుంటే తెలంగాణ జైత్ర యాత్ర అనే నినాదంతో ఉద్యమాన్ని ముందుకు నడిపారన్నారు. మూడు ఎకరాలకు మూడు గంటల కరెంట్ సరిపోతుందా.. వ్యవసాయంపై అవగాహన ఉందా? అని అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. రైతులకు 2హెచ్‌పీ, 5హెచ్‌పీ, 7హె‌చ్‌పీ వ్యవసాయ మోటార్లు మాత్రమే ఉంటాయని 10హెచ్‌పీ మోటార్లు ఎక్కడైనా ఉంటాయా అని ఎద్దేవా చేశారు. నాటి కాంగ్రెస్ హయాంలో 9గంటలు పగటి పూట కరెంట్ ఇస్తామని కనీసం రెండు గంటలు కూడా ఇవ్వలేదని విమర్శించారు. అప్పట్లో కరెంట్ లేక పంటలకు సకాలంలో నీళ్లు అందక ఎన్ని వేల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయో మీకు తెలుసా అన్నారు. రైతుల కోసం రైతు బంధు, సకాలంలో ఎరువులు అందించడం వంటి సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ చేపట్టారని ప్రజలకు చెప్పారు హరీష్ రావు.