Congress Party: మైనారిటీ డిక్లరేషన్‌కు హాజరుకానున్న సల్మాన్ ఖుర్షిద్

|

Nov 06, 2023 | 2:13 PM

తెలంగాణలో రాజకీయ సభలు హోరాహోరీగా జరుగుతున్నాయి. మన్నటి వరకూ బీసీ డిక్లరేషన్ పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేసింది కాంగ్రెస్. దీంతో పాటూ గ్యారెంటీ స్కీమ్స్ పేరుతో ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పడు మరో అస్త్రంతో ఎన్నికల బరిలో దిగేందుకు సిద్దమైంది. బీజేపీ వరుసగా సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈనెల 7న మోదీ తెలంగాణకు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే బీసీ గర్జన సభలో ప్రసంగించనున్నారు. దీనికి

తెలంగాణలో రాజకీయ సభలు హోరాహోరీగా జరుగుతున్నాయి. మన్నటి వరకూ బీసీ డిక్లరేషన్ పేరుతో బహిరంగ సభ ఏర్పాటు చేసింది కాంగ్రెస్. దీంతో పాటూ గ్యారెంటీ స్కీమ్స్ పేరుతో ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పడు మరో అస్త్రంతో ఎన్నికల బరిలో దిగేందుకు సిద్దమైంది. బీజేపీ వరుసగా సభలు నిర్వహించేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఈనెల 7న మోదీ తెలంగాణకు రానున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే బీసీ గర్జన సభలో ప్రసంగించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశారు పార్టీ పెద్దలు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ మరో డిక్లరేషన్‌కు తెరలేపింది. మైనార్టీ డిక్లరేషన్ పేరుతో నవంబర్ 9న భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. ఈ సభకు మాజీ విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ హాజరుకానున్నట్లు సమాచారం. అటు బీజేపీ సభలను ధీటుగా కాంగ్రెస్ వరుస సభలను ప్లాన్ చేస్తోంది. బీజేపీ కేంద్ర మంత్రులు, పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను పిలిపిస్తుంటే.. అదే బాటలో కాంగ్రెస్ మాజీ మంత్రులను సభకు హాజరయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దీంతో తెలంగాణ రాజకీయంలో డిక్లరేషన్ల హవా కనిపిస్తోంది. ఇక సీఎం కేసీఆర్ కూడా వరుస సభలతో దూకుడు పెంచారు. వచ్చే 16 రోజుల్లో 54 ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేస్తోంది బీఆర్ఎస్ పార్టీ. ఆరోగ్యం సహకరించకున్నా ప్రజలకు రాష్ట్ర అభివృద్ది గురించి చెప్పి మరోసారి బీఆర్ఎస్‌ను ఆశీర్వదించాలని అడిగేందుకు సిద్దమయ్యారు.

మరిన్ని తెలంగాణ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Nov 06, 2023 02:12 PM