Telangana: కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ సినీనటి దివ్యవాణి

|

Nov 22, 2023 | 10:26 AM

గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న సినీనటి దివ్యవాణి.. మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే సమక్షంలో ఆమె హస్తం పార్టీలో చేరారు. మాణిక్‌రావ్‌ ఠాక్రే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి....

గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న సినీనటి దివ్యవాణి.. మళ్లీ యాక్టివ్‌ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ మాణిక్‌రావ్‌ ఠాక్రే సమక్షంలో ఆమె హస్తం పార్టీలో చేరారు. మాణిక్‌రావ్‌ ఠాక్రే ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీలో ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఆ పార్టీ వాయిస్‌ బలంగా వినిపించేందుకు ప్రయత్నం చేసిన ఆమె.. ఇప్పుడు తెలంగాణలో ఎలాంటి రోల్‌ పోషిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

దివ్యవాణి గతంలో ఏపీ టీడీపీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. అయితే మహానాడులో ఆమెకు మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం.. పార్టీలో తగిన గుర్తింపు లేదంటూ తెలుగుదేశంను వీడారు. ఆ తర్వాత బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. అందుకు తగ్గట్లుగానే ఆమె కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వంటి అగ్రనేతలతో సమావేశమయ్యారు. కానీ ముందడుగు పడలేదు. తాజాగా దివ్యవాణి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Nov 22, 2023 10:25 AM