Bhatti Vikramarka: ఆరు గ్యారంటీల అమలుపై భట్టి విక్రమార్క రియాక్షన్

Updated on: Aug 10, 2025 | 9:20 PM

తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు పరిస్థితిపై టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్, డిప్యూటీ సీఎంకు నేరుగా ప్రశ్నలు సంధించారు. రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు ఐదు లక్షల కార్డు, పెన్షన్ పెంపు వంటి హామీలపై భట్టి విక్రమార్క ఏం సమాధానాలు ఇచ్చారంటే...?

తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం సమయంలో ఇచ్చిన వాగ్దానాలు అన్ని అమలు అవుతున్నాయా..? వాటిలో ఏవీ అసలు అమలులోకి రాలేదు..? ఏవి అరకొరగా అమలు అవుతున్నాయి..? రైతు రుణమాఫి ప్రొపర్‌గా అయిందా..? ఇందిరమ్మ ఇళ్ల సంగతి ఏంటి..? విద్యార్ధులకు ఐదు లక్షల కార్డు ఏమైంది..? పెన్షన్ నాలుగు వేల పరిస్థితి ఏంటి..?… అంటూ తెలంగాణ డిప్యూటీ సీఎంకు ప్రశ్నలు సంధించారు టీవీ9 తెలుగు మేనేజింగ్ ఎడిటర్ రజినికాంత్. వాటికి భట్టి.. పెన్షన్స్ తప్ప మిగిలిన హామిలన్నీ అమలు పరుస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published on: Aug 10, 2025 09:16 PM