Telangana: కలెక్టర్ విధులకు ఆటంకం.. MLA పాడి కౌశిక్‌రెడ్డిపై క్రిమినల్ కేసు

|

Jul 03, 2024 | 9:34 AM

మంగళవారం కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో గందరగోళం చోటుచేసుకుంది. దళితబంధు అంశంతో పాటు DEO అంశంపై కలెక్టర్ పమేలా సత్పతి సమాధానం చెప్పాలని MLA డిమాండ్ చేయడంతో.. అక్కడి నుంచి కలెక్టర్ వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. కలెక్టర్ వెళ్లకుండా అడ్డుకునేందుకు మెట్ల పై బైఠాయించారు.

జులై 2, మంగళవారం జరిగిన కరీంనగర్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రచ్చరచ్చ అయింది. కౌశిక్‌రెడ్డిపై జిల్లా పరిషత్ అధికారులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో BNS యాక్ట్ ప్రకారం 122, 126 (2) సెక్షన్ల కింద కౌశిక్‌రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసుల.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… హుజురాబాద్‌ నియోజకవర్గంలో విద్యారంగానికి సంబంధించి నెలకున్న సమస్యలపై ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అయితే ఈ రివ్యూ మీటింగ్‌కు హాజరైన MEOలను..డీఈఓ ట్రాన్స్‌ఫర్‌ చేశారు. దీంతో ఆ డీఈఓను వెంటనే సస్పెండ్‌ చేయాలని కలెక్టర్‌ను పట్టుబట్టారు..కౌశిక్‌రెడ్డి. ఈ అంశంపై సమాధానం ఇవ్వాలంటూ సమావేశ మందిరంలోనే ఆందోళనకు దిగారు. సమావేశంలో ధర్నాకు దిగిన కౌశిక్‌రెడ్డి తీరును తప్పుబట్టారు..ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన బీఆర్‌ఎస్‌ జడ్పీటీసీ రవీందర్‌. దీంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వ్యక్తిగత దూషణలకు దిగారు. ఈ క్రమంలో జెడ్పీ మీటింగ్‌ గందరగోళంగా మారడంతో సమావేశం మధ్యలోనే వెళ్లిపోయారు..కలెక్టర్‌ పమేలా సత్పతి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Published on: Jul 03, 2024 09:33 AM