CM KCR: ఆగమాగమై ఓట్లు వేయొద్దు.. అలోచించి నిర్ణయం తీసుకోండి.. సీఎం కేసీఆర్ కీలక కామెంట్స్..

| Edited By: Ravi Kiran

Oct 26, 2023 | 6:05 PM

తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దూకుడు పెంచారు. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ దూసుకుపోతున్నారు. ఇవ్వాల్టి నుంచి రెండో విడత ప్రచారానికి నాంది పలికారు. సీఎం కేసీఆర్ గురువారం నుంచి నవంబర్‌ 9వరకు నాన్‌స్టాప్‌ బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

తెలంగాణ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు దూకుడు పెంచారు. హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారంలో కేసీఆర్‌ దూసుకుపోతున్నారు. ఇవ్వాల్టి నుంచి రెండో విడత ప్రచారానికి నాంది పలికారు. సీఎం కేసీఆర్ గురువారం నుంచి నవంబర్‌ 9వరకు నాన్‌స్టాప్‌ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇవాళ ఒక్కరోజే మూడు సభల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ పాల్గొననున్నారు. అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో ప్రచారం చేయనున్నారు. అభివృద్ధి.. సంక్షేమం లక్ష్యంగా ప్రచారం నిర్వహిస్తున్న కేసీఆర్ తొలి విడత ప్రచారంలో విపక్ష పార్టీలపై ఫైర్ అయ్యారు. అచ్చంపేట, వనపర్తిలో బహిరంగ సభలు ముగించుకున్న కేసీఆర్.. ప్రస్తుతం మునుగోడులో సభలో పాల్గొన్నారు. రెండో విడత ప్రచారంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది. సీఎం కేసీఆర్ లైవ్ వీడియో వీక్షించండి..

Published on: Oct 26, 2023 03:25 PM