CM KCR: పాలమూరు పాలుగారే జిల్లా అవుతుంది.. జడ్చర్ల ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్..

Updated on: Oct 18, 2023 | 4:47 PM

CM KCR Jadcherla Meeting: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మూడోసారి అధికారం చేపట్టేందుకు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. దీనిలో భాగంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే రెండు రోజుల నుంచి వరుసగా పర్యటనలు చేస్తూ..

CM KCR Jadcherla Meeting: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మూడోసారి అధికారం చేపట్టేందుకు వ్యూహాలకు పదునుపెడుతున్నారు. దీనిలో భాగంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రచారంలో భాగంగా ఇప్పటికే రెండు రోజుల నుంచి వరుసగా పర్యటనలు చేస్తూ.. బహిరంగ సభల్లో పాల్గొంటున్న బీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ బుధవారం మహబూబ్‌నగర్‌, మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లాల్లో పర్యటించనున్నారు. ముందుగా జడ్చర్లలో నిర్వహించే బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగించనున్నారు. ఇప్పటికే పలు బహిరంగ సభల్లో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. మోసపూరిత హామీలను నమ్మవద్దంటూ కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలపై పదునైన వ్యాఖ్యలు చేస్తున్న కేసీఆర్.. ఇవాళ ఏం మాట్లాడనున్నారనేది రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది.

సీఎం కేసీఆర్ బహిరంగ సభ నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు ఈ సభకు భారీగా తరలివచ్చాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Published on: Oct 18, 2023 03:46 PM