CM Chandrababu: త్వరలో విశాఖలో పరుగులు పెట్టనున్న మెట్రో

Updated on: Dec 12, 2025 | 7:35 PM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం భవిష్యత్తుపై కీలక ప్రకటనలు చేశారు. నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. ఐటీ, ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుతో విశాఖపట్నం జ్ఞాన ఆర్థిక వ్యవస్థకు, టెక్నాలజీకి కేంద్రంగా మారుతుందని పేర్కొన్నారు. పలు అంతర్జాతీయ కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖపట్నం భవిష్యత్తుపై కీలక ప్రకటనలు చేశారు. విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టును త్వరలో ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. అదేవిధంగా, వచ్చే ఏడాది ఆగస్టు నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతుందని తెలిపారు. ఐటీ రంగంలో విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఈరోజు ఎనిమిది ఐటీ సంస్థలకు పునాది రాయి వేయడం జరిగిందని, ఇది నగర అభివృద్ధికి ఒక మైలురాయి అని అన్నారు. కాగ్నిజెంట్ వంటి కంపెనీలు రాకతో 25,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రేపే మెస్సీ Vs సీఎం రేవంత్ ఫుట్​బాల్ మ్యాచ్

భూమిపైన నూకలుంటే.. చావు నుండి ఇలా తప్పించుకుంటారు..

హెచ్-1బీ వీసా దరఖాస్తుదారులకు బిగ్ షాక్..

Sabarimala: శబరికి వెళ్లే అయ్యప్పలకు బిగ్‌ అలర్ట్‌.. ఈ విషయాలు తెలుసుకోండి

మహిళలకు గుడ్‌న్యూస్‌.. ఉచిత ఎలక్ట్రిక్ బస్సులతో పాటు.. ఇది కూడా