TDP – NDA: టీడీపీ-ఎన్డీఏ..మళ్లీ కలుస్తాయా..? రానున్న ఎన్నికల్లో అసలేం జరగబోతుంది..?

|

Apr 27, 2023 | 8:26 AM

దేశాభివృద్ధి వేరు.. రాజకీయాలు వేరన్నచంద్రబాబు నాయుడు, పార్టీలు వేరైనా.. విజన్ ఉన్న నేతలుగా ప్రధాని మోదీ, తాను మాట్లాడుకున్నామన్నారు. ప్రధాని ఏ ఆలోచనతో ఉన్నారో..

దేశాభివృద్ధి వేరు.. రాజకీయాలు వేరన్నచంద్రబాబు నాయుడు, పార్టీలు వేరైనా.. విజన్ ఉన్న నేతలుగా ప్రధాని మోదీ, తాను మాట్లాడుకున్నామన్నారు. ప్రధాని ఏ ఆలోచనతో ఉన్నారో.. తానూ అదే ఆలోచనతో ఉన్నానంటూ కలుపుకొని పోయే ప్రయత్నం చేశారు. అంతేకాదు ప్రధాని విజన్‌తో పూర్తిగా ఏకీభవిస్తున్నాన్న చంద్రబాబు, అభివృద్ధి విషయంలో ఆయన ఆలోచనలకు అనుగుణంగా తన పరిధి మేరకు కలిసి పనిచేయడానికి సిద్దమని తెలిపారు. భారతదేశ బలమేంటో.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి చాటి చెబుతున్నారని ప్రశంసించారు. గతంలో కూడా తాను మోదీ పాలసీలను వ్యతిరేకించలేదని గుర్తుచేశారు. పీఎం మోదీ విషయంలో చంద్రబాబు ఇంత సానుకూలంగా మాట్లాడేసరికి.. దీనర్థం… రానున్న ఎన్నికల్లో ఎన్డీఏతో కలిసి పని చెయ్యడానికి సిద్ధమనేనా అని ప్రశ్నించేసరికి.. సమాధానం చెప్పేందుకు ఇది సరైన వేదిక కాదంటూ దాటేసారు బాబు. అయితే మోదీని తెగ మెచ్చుకుంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు.. ఏపీలో రాజకీయ వేడిని అమాంతం పెంచేశాయి..

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Urvashi Rautela: ‘ఉర్వశిపై అఖిల్ వేధింపులు’ ట్వీట్.. కోర్టుకెక్కిన ఏజెంట్ బ్యూటీ..!

Jr NTR – Sr NTR: జూ.ఎన్టీఆర్ చేతుల మీదగా పెద్ద ఎన్టీఆర్ 54 అడుగుల భారీ విగ్రహావిష్కరణ..

Ustad Bhagat Singh: గబ్బర్‌ సింగ్‌కు మించి ఉంటది.. ట్రెండ్ సెట్టర్ గా పవన్ కళ్యాణ్..!

Published on: Apr 27, 2023 08:26 AM