Big News Big Debate: TSPSC లీక్స్‌.. తెలంగాణ ఎన్నికల్లో అన్ని పార్టీలకు ఇప్పుడు ప్రధాన అస్త్రం..

Updated on: Apr 26, 2023 | 7:00 PM

తెలంగాణలో ఇప్పుడు యంగ్‌ తరంగ్‌ అంటున్నాయి రాజకీయ పార్టీలు. ఎన్నికలకు ఎంతో గడువు లేదు. పైగా యువత ఓట్లు అత్యంత కీలకం. దాదాపు 30 లక్షల మంది తెలంగాణ యువత TSPSCలో తమ వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందులో ప్రతిఒక్కరూ ప్రస్తుతం వస్తున్న నోటిఫికేషన్లలో ఏదో ఓ పరీక్షకు సిద్ధమవుతున్నారు.

తెలంగాణలో ఇప్పుడు యంగ్‌ తరంగ్‌ అంటున్నాయి రాజకీయ పార్టీలు. ఎన్నికలకు ఎంతో గడువు లేదు. పైగా యువత ఓట్లు అత్యంత కీలకం. దాదాపు 30 లక్షల మంది తెలంగాణ యువత TSPSCలో తమ వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అందులో ప్రతిఒక్కరూ ప్రస్తుతం వస్తున్న నోటిఫికేషన్లలో ఏదో ఓ పరీక్షకు సిద్ధమవుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో విపక్షాలు ఆయుధంగా దొరికింది టీఎస్‌పిఎస్సీ లీక్స్. నెంబర్‌ పెద్దగా ఉంది… పైగా యువత. రాజకీయంగా వారికి దగ్గరైతే వచ్చే ఎన్నికల్లో సాలీడ్‌ ఓటింగ్‌ వస్తుందని భావిస్తున్న పార్టీలు ఉద్యమ కార్యాచరణలో బిజీగా ఉన్నాయి. లీక్స్‌కు బాధ్యుడిని చేస్తూ కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేయాలి.. సిట్టింగ్‌ జడ్జి చేత విచారణ జరిపించాలి.. అభ్యర్ధులకు లక్ష పరిహారం ఇవ్వాలంటూ మూడు డిమాండ్లతో బీజేపీ నిరుద్యోగ మార్చ్‌లు నిర్వహిస్తోంది. త్వరలో హైదరాబాద్‌లో మిలియన్ మార్చ్‌ కూడా చేపడతామంటోంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Rare Bird: ప్రకాశం జిల్లాలో వింత పక్షి ప్రత్యక్షం.. వీడియో చూడండి