Big News Big Debate: రిజర్వేషన్లతో పేదరికం పోతుందా ?? లైవ్ వీడియో
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యుయు లలిత్ రిటైర్మెంట్ రోజు ఆయన నేతృత్వం వహించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం కీలక తీర్పు చెప్పింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు గతంలో కేంద్రం ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లను సమర్థించింది.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ యుయు లలిత్ రిటైర్మెంట్ రోజు ఆయన నేతృత్వం వహించిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం కీలక తీర్పు చెప్పింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు గతంలో కేంద్రం ఇచ్చిన పది శాతం రిజర్వేషన్లను సమర్థించింది. ఆ కోటా రద్దుకు దాఖలైన పిటిషన్లను డిస్మస్ చేసింది ధర్మాసనం. ఈ తీర్పుతో విద్య, ఉద్యోగ అవకాశాల్లో EWS కింద పది శాతం రిజర్వేషన్లు కొనసాగుతాయి. ఐదుగురు న్యాయమూర్తుల్లో ముగ్గురు కోటాను సమర్ధించారు. ఇద్దరు వ్యతిరేకించారు. పది శాతం కోటా కల్పిస్తూ కేంద్రం చేసిన 103 రాజ్యాంగ సవరణ… రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కాదని జస్టిస్ దినేష్ మహేశ్వరి, జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పార్ధివాలా తీర్పు చెప్పారు. చీఫ్ జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ రవీంద్ర భట్ మాత్రం భిన్నమైన తీర్పు చెప్పారు. ఈ కోటాతో మొత్తం రిజర్వేషన్లు 50 శాతం దాటతాయని అభిప్రాయపడ్డారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
హన్సిక పెళ్లికి ముందే.. కాబోయే భర్త భండారం బట్టబయలు
Vishwak Sen: తన సీదా మాటలతో అర్జున్‌ను దెబ్బకొట్టిన విశ్వక్
ప్రభాస్ ఇజ్జత్‌కు సవాల్.. నెట్‌ఫ్లిక్స్ తీరుపై తీవ్ర ఆగ్రహం..