Big News Big Debate: డ్రగ్స్‌, తంబాకుపై బీఆర్ఎస్‌ – బీజేపీ నేతల మధ్య డైలాగ్‌ వార్‌.. లైవ్ వీడియో

|

Dec 21, 2022 | 7:05 PM

బండి సంజయ్‌ - కేటీఆర్‌ మధ్య బ్రగ్స్‌ పంచాయితీ కంటిన్యూ అవుతోంది. నిన్న బీజేపీ నేతలు రియాక్ట్‌ అయితే ఇవాళ నేరుగా బీజేపీ చీఫ్‌ బండి లైన్‌లోకి వచ్చారు.

బండి సంజయ్‌ – కేటీఆర్‌ మధ్య బ్రగ్స్‌ పంచాయితీ కంటిన్యూ అవుతోంది. నిన్న బీజేపీ నేతలు రియాక్ట్‌ అయితే ఇవాళ నేరుగా బీజేపీ చీఫ్‌ బండి లైన్‌లోకి వచ్చారు. ఎప్పుడో సవాల్‌ చేస్తే ఇప్పుడు ఎందుకొచ్చారంటూ షాకింగ్‌ కామెంట్స్‌ కూడా చేశారు. ఈ వ్యవహారంలో ఎంట్రి ఇచ్చిన కాంగ్రెస్‌… అటు బీఆర్ఎస్‌.. ఇటు బీజేపీ చిత్తశుద్దిని ప్రశ్నించారు. డ్రగ్స్‌ సవాళ్లు అటుంచితే తాజాగా లిక్కర్‌ స్కామ్‌ ఛార్జిషీట్లో కల్వకుంట్ల కవిత పేరుపై తెలంగాణలో ప్రకంపనలు మొదలయ్యాయి. పక్కా ఆధారాలతో అడ్డంగా దొరికారంటూ బీజేపీ నేతలు వరుసగా మీడియా ముందుకొచ్చి మరీ విమర్శలు గుప్పిస్తున్నారు. ఛార్జిషీట్లో 28 సార్లు కవిత పేరు ఉందంటూ రాజగోపాల్‌ ట్వీట్‌ చేయగా… 28 సార్లు నా పేరు చెప్పించినా 28 వేల సార్లు చెప్పించినా అబద్ధం నిజం కాదంటూ కౌంటర్ ఇచ్చారు కవిత.

Published on: Dec 21, 2022 07:05 PM