Big News Big Debate: ఎమ్మెల్సీ ఫలితాలు ఏపీ పాలిటిక్స్‌ను మార్చాయా? టీడీపీకి టచ్‌లో 40 మంది నిజమా ??

Updated on: Mar 30, 2023 | 7:02 PM

ఏపీలో రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అన్ని పార్టీలు పొత్తులు.. ఎత్తులు.. ముందస్తు ఎన్నికలు అంటూ ఎవరికి నచ్చిన రాగం వారు పాడుతున్నారు.

ఏపీలో రాజకీయాలు చకచకా మారిపోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత అన్ని పార్టీలు పొత్తులు.. ఎత్తులు.. ముందస్తు ఎన్నికలు అంటూ ఎవరికి నచ్చిన రాగం వారు పాడుతున్నారు. సరిగ్గా ఇదే సమయంలో సీఎం జగన్మోహన్‌ రెడ్డి కూడా వరసగా 15 రోజుల గ్యాప్‌లోనే రెండుసార్లు ఢిల్లీ వెళ్లడంతో రాజకీయ వర్గాల్లో ఊహాలకు అంతే లేకుండా పోయింది. సోమవారం నేతలతో సీఎం సమావేశం ఏర్పాటు చేయడం మరింత హీట్‌ రాజేసింది. ముందస్తు ముచ్చటే ఉండదని గతంలోనే సీఎం పక్కాగా చెప్పారు.. అయినా అప్పటి పరిస్థితులు వేరు.. ఇప్పుడున్న పరిస్థితులు వేరు ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చంటున్నాయి కొన్ని పార్టీలు. కమ్యూనిస్టు నాయకులు అయితే ఏకంగా పొత్తులపై ముందే మాట్లాడుకుంటే బెటర్‌ అని సలహాలు కూడా ఇస్తున్నారు. ఎన్నికల పొత్తుల మేటర్‌ పక్కనపెట్టిన టీడీపీ.. వైసీపీ నేతలు టచ్‌లో ఉన్నారంటూ సరికొత్త పల్లవి అందుకుంది.

Published on: Mar 30, 2023 07:02 PM