Big News Big Debate: మళ్లీ ఉద్యమబాటలో ఏపీ ఉద్యోగులు.! సంఘాల మధ్య చిచ్చు పెడుతోందెవరు..?

|

Jan 20, 2023 | 7:03 PM

ఏపీ ఉద్యోగులు మళ్లీ ఉద్యమ బాట పడుతున్నారు. అయితే కలిసి పోరాటం చేయాల్సిన సంఘాల నేతలే ఇప్పుడు కయ్యానికి దిగుతున్నారు. ఇప్పటికిప్పుడు పోరాటం చేయాలా? వద్దా?

ఏపీ ఉద్యోగులు మళ్లీ ఉద్యమ బాట పడుతున్నారు. అయితే కలిసి పోరాటం చేయాల్సిన సంఘాల నేతలే ఇప్పుడు కయ్యానికి దిగుతున్నారు. ఇప్పటికిప్పుడు పోరాటం చేయాలా? వద్దా? అనే విషయంలోనే గొడవ పడుతున్నారు. ఒక సంఘం ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తే మరో సంఘం తీవ్రంగా తప్పుబడుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వెనుక ఏదో శక్తి ఉందన్న ఎన్జీవోల సంఘం ఆరోపణ సంచలనం రేపుతోంది. గత ఏడాది ఉమ్మడిగా పోరాటం చేసిన సంఘాల నేతల మధ్య ఇప్పుడు చిచ్చు పెడుతోంది ఎవరు? నిజంగానే ఉద్యోగ సంఘాల్ని కొన్ని శక్తులు నడిపిస్తున్నాయా?2022 ప్రారంభంలో కలిసి పోరాటం చేసి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాన్ని ఒప్పించిన ఏపీలోని ఉద్యోగ సంఘాల నేతల మధ్య ఇప్పుడు తీవ్రమైన విభేదాలు వచ్చాయి. ప్రభుత్వాన్ని కాదని గవర్నర్‌ దగ్గరకు వెళ్లి ఒక సంఘం నేతలు ఫిర్యాదు చేయడం పెద్ద రచ్చకే దారితీస్తోంది. ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న సూర్యనారాయణ గవర్నర్‌ హరిచందన్‌ను కలిసి తమ సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి నెలా ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. జీతాల కోసమే అడుక్కునే పరిస్థితి వస్తే ఇక పోరాటం తప్పదని డేట్‌లు కూడా ప్రకటించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us on