Big News Big Debate: ఏపీలో పొత్తు రాజకీయం.. రణస్థలం సభలో పవన్‌ కల్యాణ్‌ కీలక వ్యాఖ్యలు..

|

Jan 13, 2023 | 7:02 PM

రణస్థలం నుంచి 2024 ఎన్నికల రణంపై క్లారిటీ ఇచ్చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. పొత్తులపై ఇన్నాళ్లు ఎన్నెన్నో ఊహాగానాలు వచ్చినా వాటన్నింటినీ


రణస్థలం నుంచి 2024 ఎన్నికల రణంపై క్లారిటీ ఇచ్చేశారు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌. పొత్తులపై ఇన్నాళ్లు ఎన్నెన్నో ఊహాగానాలు వచ్చినా వాటన్నింటినీ తెరదించుతూ కేడర్‌కు, పార్టీలకు స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. గతంలో టీడీపీని ఎన్నో అన్నాం, ఇప్పుడు సర్దుకుపోవాలి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒంటరి పోరాటం అంటే వీరమరణమేనన్నారు. సింగిల్‌గా వస్తే గెలిపిస్తామన్న నమ్మకాన్ని జనం కలిగిస్తేనే ఒంటరి పోరాటం చేస్తానన్నారు. లేదంటే వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోనని తేల్చి చెప్పారు. పవన్‌ చేసిన మిగిలిన వ్యాఖ్యలకు రియాక్షన్స్‌ ఎలా ఉన్నా… పొత్తులపై కామెంట్లకు వైసీపీ నుంచి స్ట్రాంగ్‌ కౌంటర్లే వస్తున్నాయి. ఒంటరిగానే కాదు… కలిసి వచ్చినా జనసేన అధ్యక్షుడికి రాజకీయ మరణం తప్పదంటున్నారు మంత్రులు, వైసీపీ నేతలు.

పవన్‌పై వైసీపీ వరుస కౌంటర్లతో చంద్రబాబు సైతం రియాక్ట్‌ అయ్యారు. పవన్‌ సభ పెట్టుకుంటే వైసీపీకి ఎందుకంత భయమని ప్రశ్నించారు. ఎన్నికలకు ఇంకా ఏడాన్నదిర టైం ఉంది. ఈలోపే పొత్తులపై పవన్‌ స్పష్టత ఇస్తున్నారు కానీ ప్రకటన మాత్రం చేయడం లేదు. ఆ ప్రకటన చేయకుండా ఎవరైనా అడ్డుకుంటున్నారా? ఇప్పటి వరకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటన్నది ఆసక్తిగా మారింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.