AP Elections 2024: వాటిని గమనించే ప్రజలు తీర్పు ఇస్తారు.. విపక్ష కూటమిపై అవంతి శ్రీనివాస్ ఫైర్

|

May 08, 2024 | 1:32 PM

టీడీపీ, బీజేపీ, జనసేన 2014లో ఎందుకు కలిశాయి, 2019లో మళ్ళీ ఎందుకు విడిపోయారు.. మళ్ళీ ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ లాంటి వాటిని ఫణంగా పెట్టి ఎందుకు కలుస్తున్నారో చెప్పాలన్నారు భీమిలి వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేయడం,

టీడీపీ, బీజేపీ, జనసేన 2014లో ఎందుకు కలిశాయి, 2019లో మళ్ళీ ఎందుకు విడిపోయారు.. మళ్ళీ ప్రత్యేక హోదా, స్టీల్ ప్లాంట్ లాంటి వాటిని ఫణంగా పెట్టి ఎందుకు కలుస్తున్నారో చెప్పాలన్నారు భీమిలి వైసీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్. ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై దుష్ప్రచారం చేయడం, అలవికాని హామీలు ఇవ్వడం, పెన్షన్లు, డీబీటీ పథకాలను అడ్డుకోవడంలాంటి వాటిని ప్రజలు గమనించే తీర్పు ఇస్తారన్న నమ్మకం తమకు ఉందన్నారు అవంతి. జగన్మోహన్‌రెడ్డి మళ్ళీ సీఎం కావడం ఖాయమని, జూన్ 4న తన నియోజకవర్గం నుంచే పాలన ప్రారంభం కానుందన్నారు అవంతి. భీమిలి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్న అవంతి శ్రీనివాస్‌.. విపక్ష కూటమికి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని అంగీకరించినట్లేన అన్నారు.  ఏ ఆంధ్రుడూ అలా చేయరని అన్నారు.

Follow us on