AP News: మీకు – నాకు మధ్య పరదాలు లేవు.. చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
తణుకు సభలో గత వైసీపీ ప్రభుత్వం, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శనాస్త్రాలు సంధించారు. గత సీఎం ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? వారితో మాట్లాడారా? అని ప్రశ్నించారు. అయితే ఇప్పుడు తనకు, ప్రజలకు మధ్య పరదాలు లేవన్నారు. ప్రజల సమస్యలు వినేందుకే తాను వచ్చానని వ్యాఖ్యానించారు.
AP CM Chandrababu Naidu in Tanuku: తమది ప్రజా ప్రభుత్వమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా శనివారం జరుగుతున్న “స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర” కార్యక్రమంలో భాగంగా తణుకులోని ఎన్టీఆర్ పార్క్ లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చంద్రబాు నాయుడు చెత్త ఊడ్చారు. అనంతరం కార్మికులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలు, బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడిన ఆయన.. ప్రజలు ఏమి చెప్పినా వినే ప్రభుత్వం తమదన్నారు. గత ప్రభుత్వంలో మాదిరి, మీకు నాకు మధ్య పరదాలు లేవంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో సీఎం ఎప్పుడైనా ప్రజల్లో తిరిగారా? ప్రజలతో మాట్లాడారా? అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు వినేందుకే తాను వచ్చానని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసి వెళ్లందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పును మిగిల్చి వెళ్లిందని.. ఇప్పుడు అప్పుతో పాటు వడ్డీ కట్టాల్సి వస్తోందన్నారు.
తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు
తణుకులో స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారు పాల్గొన్నారు.
సీఎం మున్సిపల్ కార్మికులతో కలిసి ఎన్టీఆర్ పార్క్లో చెత్తను ఊడ్చి పరిశుభ్రం చేశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. అందరితో కలిసి ఫోటోలు దిగారు.#SwarnaAndhraSwachhAndhra #MyCleanAP… pic.twitter.com/LiHEbXNNaL— Telugu Desam Party (@JaiTDP) March 15, 2025