Watch Video: డ్రామాలు చేయడం జగన్‌కు తెలీదు.. మంత్రి బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు

Updated on: Apr 15, 2024 | 4:35 PM

ఒక షార్ప్‌ షూటర్‌ కొట్టినట్లుగా ఏపీ సీఎం జగన్‌పై దాడి జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ ఘటనను తేలిగ్గా తీసేయడానికి లేదన్నారు. ఈ ఘటనను డ్రామా అంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టారు. జగన్మోహన్ రెడ్డి నటుడి కాదని, డ్రామాలు చేయడం ఆయనకు రాదన్నారు. ముందురోజే చంద్రబాబు భాష అందరూ చూశారని..

ఒక షార్ప్‌ షూటర్‌ కొట్టినట్లుగా ఏపీ సీఎం జగన్‌పై దాడి జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఈ ఘటనను తేలిగ్గా తీసేయడానికి లేదన్నారు. ఈ ఘటనను డ్రామా అంటూ టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టారు. జగన్మోహన్ రెడ్డి నటుడి కాదని, డ్రామాలు చేయడం ఆయనకు రాదన్నారు. ముందురోజే చంద్రబాబు భాష అందరూ చూశారని.. ఆయన భాషను ఖండిస్తున్నామన్నారు. ఈరోజు కాకపోయినా రేపు నిజం బయటకు వస్తుందన్నారు. అటు పవన్‌ కల్యాణ్ పైనా బొత్స సత్యనారాయణ ఫైర్‌ అయ్యారు. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటూ పవన్ చేస్తున్న వ్యాఖ్యలు అపరిపక్వంగా ఉన్నాయన్నారు. పార్టీ అధినేత.. ఎక్కడైనా తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రాధేయపడతారా అని ప్రశ్నించారు.