మేనమామపై పెట్టిన పోక్సో కేసులో ట్విస్ట్
పోక్సో కేసులో బాంబే హైకోర్టు అసాధారణ తీర్పు వెలువరించింది. 52 ఏళ్ల నిందితుడిపై కేసు కొట్టివేస్తూ, బాధితురాలైన 17 ఏళ్ల బాలికకు ల్యాప్‌టాప్ కొనుగోలుకు ₹1.5 లక్షల జరిమానా విధించింది. కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదరడంతో, కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. లైంగిక వేధింపుల ఆరోపణలు, రాజీ ప్రక్రియ, శిక్ష రూపంలో విద్యకు మద్దతు ఇవ్వడం ఈ తీర్పులోని ముఖ్య అంశాలు.
పోక్సో కేసులో బాంబే హైకోర్టు అసాధారణ తీర్పు ఇచ్చింది. పూణెకు చెందిన 52 ఏళ్ల వ్యాపారవేత్తపై నమోదైన కేసును కొట్టేస్తూ అతడికి 1.5 లక్షల రూపాయల జరిమానా విధించింది. ఆ మొత్తంతో బాధితురాలైన 17 ఏళ్ల బాలికకు ఆమె చదువుకు ఉపయోగపడేలా ఆపిల్ మ్యాక్‌బుక్ లేదా మరో మంచి ల్యాప్‌టాప్ కొనివ్వాలని ఆదేశించింది. అసలేం జరిగిందంటే.. 2024 ఆగస్టులో 11వ క్లాస్‌లో ఉన్న బాలిక తన మేనమామపై లైంగిక వేధింపుల ఆరోపణల కింద పోలీసులకు కంప్లైంట్ చేసింది. స్కూల్‌కు కారులో తీసుకెళ్లేటప్పుడు తన బాయ్ ఫ్రెండ్‌గా ఉంటావా? అని అడిగాడని, తర్వాత తరచూ మెసేజ్‌లు పంపేవాడని ఆరోపించింది. కిరాణా సామాను కోసం వెళ్లినప్పుడు “ఐ లవ్ యూ” చెప్పి, ముద్దు అడిగి, తన ఛాతీపై అసభ్యంగా తాకాడని ఫిర్యాదులో తెలిపింది. ఈ విషయాన్ని మొదట స్కూల్ కౌన్సిలర్‌కు, ఆ తర్వాత నానమ్మకు చెప్పడంతో ముంబైలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసు విచారణ సందర్భంగా… మలుపు తిరిగింది. ఇదంతా కేవలం ఒక అపార్థం వల్లే జరిగిందని, ఇప్పుడు కుటుంబ సభ్యుల మధ్య రాజీ కుదిరిందని నిందితుడి తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కోర్టులో హాజరైన బాలిక, ఆమె తల్లిదండ్రులు కూడా దీన్ని అంగీకరించారు. కేసును ఇకపై కొనసాగించడం తమకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. బాధితురాలి వాదనను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్ భోంస్లే నేతృత్వంలోని ధర్మాసనం, కేసు విచారణ కొనసాగించడం వల్ల ప్రయోజనం ఉండదని అభిప్రాయపడింది. అయితే, కేసు నమోదు తీరును బట్టి నిందితుడికి జరిమానా విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. దాంతో న్యాయస్థానం, నిందితుడికి రూ.1.5 లక్షల రూపాయల జరిమానా విధించింది. ల్యాప్‌టాప్ కొనుగోలు చేయగా మిగిలిన డబ్బును హైకోర్టు ఉద్యోగుల వైద్య సంక్షేమ నిధికి జమ చేయాలని ఆదేశించింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధర..ఇవాళ తులం ఎంతంటే
ఆ ఊరిలో బారసాల చేయాలంటే.. హోలీ రావాల్సిందే.. కారణం
భక్తి పారవశ్యం లో జనం.. శూలాల నైవేద్యం..
