Narendra Modi: ఏపీలో కూటమి గెలుపే లక్ష్యంగా.. విజయవాడలో ప్రధాని మోదీ రోడ్ షో..

|

May 08, 2024 | 7:09 PM

ఏపీలో కూటమి గెలుపే లక్ష్యంగా ప్రధాని మోదీ పర్యటనలు కొనసాగుతున్నాయి. విజయవాడలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్ షోలో పాల్టొన్నారు మోదీ. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజి సర్కిల్‌ వరకు ఈ మోదీ రోడ్‌ షో కొనసాగుతుంది. ప్రధాని రోడ్‌ షో నేపథ్యంలో..

ఏపీలో కూటమి గెలుపే లక్ష్యంగా ప్రధాని మోదీ పర్యటనలు కొనసాగుతున్నాయి. విజయవాడలో కూటమి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రోడ్ షోలో పాల్టొన్నారు మోదీ. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియం నుంచి బెంజి సర్కిల్‌ వరకు ఈ మోదీ రోడ్‌ షో కొనసాగుతుంది. ప్రధాని రోడ్‌ షో నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. 5వేల మంది పోలీసులతో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. నగరంలో ట్రాపిక్‌ ఆంక్షలు విధించారు. భారీఎత్తున ఫ్లడ్ లైట్లను ఏర్పాటు చేశారు. ప్రధాని పర్యటన టైమ్‌లో కరెంట్ కోత ఉండకూడదని విద్యుత్ శాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రతి 50 మీటర్లకు ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేశారు.